ఫై ఓవర్ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్ బీమ్ ..కారులోకి చొచ్చుకెళ్లి బీభత్సం.. వీడియో
మహానగరాల్లో ఫ్లైఓవర్ల పెచ్చులు ఎప్పుడు ఊడి ఎవరి మీద పడతాయో తెలియని పరిస్థితి. సాధారణంగా వర్షం వచ్చినప్పుడు.. ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పుడు ఫ్లైఓవర్ల కింద జనం ఆగడం చూస్తాం. అలాంటి సమయంలో పెచ్చులు ఊడిపడి మాడు పగిలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అచ్చం అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కాకపోతే ఇక్కడ ఓ కారు ధ్వంసమైంది. ముంబైలోని ఓ ఫ్లైఓవర్ నుంచి కాంక్రీట్ ముక్క ఊడిపడింది.
కింద రోడ్డుపై వెళుతున్న కారుపై పడింది. విండ్ షీల్డ్ పగిలిపోయి కారు లోపలికి కాంక్రీట్ ముక్క చొచ్చుకుపోయింది. ఈ ఘటన ఘాట్‌కోపర్ లో జరిగినట్లు వైరల్ అవుతోన్న పోస్ట్ ప్రకారం తెలుస్తోంది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. పోలీసు అధికారితో సహా అనేక మంది కారు చుట్టూ గుమిగూడారు. తృటిలో ప్రమాదం నుంచి తప్పుకున్న ధ్వంసమైన కారు నుంచి డోర్ తెరుచుకుని బయటకు రావడం వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన X ఖాతాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఫ్లైఓవర్ కింది నుంచి వెళుతున్నప్పుడు పైన కూడా ఓ కన్నేయాలని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం
సూర్యుడికి సోదరుడు ఉన్నాడా..?వీడియో
ప్లేటు నిండా రొయ్యల కర్రీ..తినాలంటే వర్రీ వీడియో
క్రమం తప్పకుండా స్కూలుకి వస్తూ.. కొండముచ్చు ఏం చేస్తుందో చూడండి
వైరల్ వీడియోలు
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!

