అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
మధురాంతకంలోని ఒక సరస్సులో ఏప్రిల్ 8న ఉదయం మణికందన్ అనే వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లాడు. అతనికి ఒక చేపదొరికింది. అక్కడే మరో చేప కనిపించడంతో ముందుగా పట్టుకున్న చేపను నోట్లో పెట్టుకొని రెండో చేపను పట్టుకునేందుకు నీటిలోకి వంగాడు. అంతే అతని నోటిలో ఉన్న చేప లోపలికి వెళ్లి అతని శ్వాసనాళంలోకి దూసుకెళ్లింది. దాంతో మణికందన్ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ గిలగిలలాడిపోయాడు. గొంతులోకి దూసుకెళ్లిన చేపను బయటకు లాగడానికి ప్రయత్నిస్తూ నీటిలోంచి బయటకు పరుగెత్తాడు. భయాందోళనతో అతను సమీపంలోని అరయ్యప్పక్కం గ్రామంలోని తన ఇంటి వైపు పరిగెత్తాడు. కానీ మార్గమధ్యలోనే అతడు కుప్పకూలిపోయాడని పోలీసులు తెలిపారు.
అతని గొంతులోకి దూరిన చేపను తొలగించడానికి కొంతమంది స్థానికులు ప్రయత్నించారు. కానీ దాని వీపుపై ఉన్న ముళ్లు అతని శ్వాసనాళలో గుచ్చుకోవడం వల్ల వారు దాన్ని బయటకు లాగలేకపోయారు. హుటాహుటిన మణికందన్‌ను చెంగల్‌పేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయినట్లుగా ప్రకటించారు. రోజువారీ కూలీ అయిన మణికందన్ సరస్సులో చేపలు పట్టేవాడని, తను చేతులతోనే చేపలు పట్టడంలో నిపుణుడని స్థానికులు తెలిపారు. అతను సాధారణంగా ఎప్పూడు స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లేవాడని, కానీ మంగళవారం అతను ఒంటరిగా వెళ్లినట్టుగా చెప్పారు. దాంతో అతనికి సాయం చేయడానికి దగ్గరల్లో ఎవరూ లేకుండా పోయారని గ్రామస్తులు వాపోయారు. మణికందన్ మరణంతో వారి కుటుంబం, అటు గ్రామంలోనూ విషాద చాయలు అలుముకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం
మైక్రోసాఫ్ట్ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్ బీమ్ ..కారులోకి చొచ్చుకెళ్లి బీభత్సం.. వీడియో
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ
