AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువతి సాహసం.. బెడిసి కొట్టడంతో ఇలా..!వీడియో

యువతి సాహసం.. బెడిసి కొట్టడంతో ఇలా..!వీడియో

Samatha J
|

Updated on: Apr 12, 2025 | 8:55 PM

Share

ప్రస్తుతం యువతకు సోషల్‌ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చి బాగా ఉంది. దాని కోసం వారు ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయి రీల్ చేయడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి.ఈ వీడియోలో చూస్తుంటే అదొక గ్రామీణ ప్రాంతంలా ఉంది. చుట్టూ పచ్చని మొక్కలు.. ఆ మొక్కల మధ్యన మేత మేస్తూ ఓ మేక.. ఇంటిముందు స్టోర్‌ చేసి పెట్టుకున్న నీళ్ల డ్రమ్ము.. ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణానికి అద్దం పడుతున్నాయి. ఆ ఇంటి ముందు ఓ నులకమంచం వాల్చి ఉంది.

అక్కడికి ఓ యువతి వచ్చింది. ఆమె ఏదో స్టంట్‌ చేయాలనుకుంది. అందుకు ఆమె ఆ మంచాన్ని ఎంచుకుంది. ఆ మంచానికి కొంచెం దూరంగా వెళ్లి పరుగెత్తుకొచ్చి ఆ మంచం ఇవతలినుంచి అవతలికి జంప్‌ చేసింది. మొదటి, రెండో ప్రయత్నం విజయవంతమైంది. ఈసారి మంచాన్ని నిలబెట్టి దానిపైనుంచి దూకాలనుకుంది. ఆ ప్రయత్నం కూడా చేసింది. అయితే హైట్‌ కొంచెం ఎక్కువవడంతో కాలు మంచానికి తగిలి పడిపోయింది. దెబ్బకు అవాక్కయిన ఆ అమ్మాయి తనను ఎవరైనా చూశారేమోనని చుట్టూ పరిశీలించింది. ఒక్క మేక తప్ప అక్కడెవరూ లేకపోవడంతో హమ్మయ్య అనుకుంది. మంచంమీదే పడటంతో పెద్దగా దెబ్బలు తగిలినట్టు లేవు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే 5 లక్షలమందికి పైగా వీక్షించారు. పెద్దసంఖ్యలో లైక్‌ చేశారు. నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం

సూర్యుడికి సోదరుడు ఉన్నాడా..?వీడియో

 

ప్లేటు నిండా రొయ్యల కర్రీ..తినాలంటే వర్రీ వీడియో

 

క్రమం తప్పకుండా స్కూలుకి వస్తూ.. కొండముచ్చు ఏం చేస్తుందో చూడండి