వారం రోజుల్లో కూతురి పెళ్లి.. ఇంతలో కాబోయే అల్లుడితో అత్త జంప్.. వీడియో
అలీగఢ్ లోని మద్రాక్ లో విచిత్ర సంఘటన జరిగింది. వారం రోజుల్లో కూతురికి పెళ్లి జరగాల్సి ఉండగా అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేయాల్సిన అత్త కాబోయే అల్లుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. ఓ మహిళ తన కూతురి కోసం ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. అబ్బాయి కూతురుకి నచ్చడంతో ఇరు కుటుంబాలు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాయి.
ఏప్రిల్ 16న పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. బంధువులు, స్నేహితులకు ఆహ్వానపత్రికలు కూడా పంచారు. పెళ్లి ఏర్పాట్ల కోసం తరచూ అల్లుడు అత్తవారింటికి వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కాబోయే అల్లుడితో అత్త ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. అబ్బాయికి కూడా ఆమె నచ్చడంతో ఇద్దరూ ప్రేమాయణం సాగించారు. ప్రేయసిగా మారిన అత్త కోసం మనోడు ఓ కొత్త ఫోన్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడట. పెళ్లి జరిగితే విడిపోవాల్సి వస్తుందని.. కలిసి ఉండటం కుదరదని భావించిన ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయేందుకు ప్లాన్ వేశారు. పెళ్లికి ఇంకా తొమ్మిది రోజులు ఉందనంగా పెళ్లి కోసం చేయించిన నగలు, డబ్బు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయారు. షాపింగ్ కోసమని వెళ్లిన వారు తిరిగి రాకపోవడం, ఇంట్లో ఉన్న నగలు, డబ్బు కూడా కనిపించకపోవడంతో ఇరు కుటుంబాలకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం
సూర్యుడికి సోదరుడు ఉన్నాడా..?వీడియో
ప్లేటు నిండా రొయ్యల కర్రీ..తినాలంటే వర్రీ వీడియో
క్రమం తప్పకుండా స్కూలుకి వస్తూ.. కొండముచ్చు ఏం చేస్తుందో చూడండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
