AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Protest Against gas cylinder price: ఇదేందయ్యా ఇది.. నేనెక్కడా చూడలా.. ధర్నా ఇలా కూడా చేస్తారా?

Protest Against gas cylinder price: ఇదేందయ్యా ఇది.. నేనెక్కడా చూడలా.. ధర్నా ఇలా కూడా చేస్తారా?

J Y Nagi Reddy

| Edited By: Anand T

Updated on: Apr 12, 2025 | 3:04 PM

దేశంలో వంటగ్యాస్ ధరల పెండాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. గ్యాస్‌ సిలిండర్‌కు పాడే కట్టి నగంలో శవయాత్ర నిర్వహించారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి కూడా పాడేకడతామని హెచ్చరించారు.

వంటగ్యాస్ ధరల పెరుగుదలపై సీపీఐ కార్యకర్తలు వినూత్న నిరసనకు దిగారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్యాస్ సిలిండర్లకు పాడెకట్టి శవయాత్ర చేపట్టారు. నగరంలోని  స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ వరకు గ్యాస్ సిలిండర్  శవయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు రంగన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్యాస్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలను నడ్డి విరుస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క రైతులు బతుకుదెరువు కోసం గ్రామాలు వదిలి పట్నాల బాట పడుతుంటే..వాటిని నివారించే చర్యలు చేపట్టకుండా.. ఇలా ధరలు పెంచడఏంటని ప్రశ్నించారు. పేదల పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదు అన్నారు. వెంటనే పెంచిన గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షాణ ప్రజల మద్దతు కూడా పెట్టుకుని రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి కూడా పాడే కడతామని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Apr 12, 2025 03:02 PM