AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబానీ ఇంట్లో ఏసీ లేదు.. మరి ఎండాకాలంలో ఎలా..?వీడియో

అంబానీ ఇంట్లో ఏసీ లేదు.. మరి ఎండాకాలంలో ఎలా..?వీడియో

Samatha J

|

Updated on: Apr 12, 2025 | 8:45 PM

దేశంలో అపరకుబేరుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ముఖేశ్ అంబానీ. దేశంలో ఎవరికీ లేనంత ఆస్తి ఆయన సొంతం. సకల భోగాలు కలిగిన ఆయన ఇల్లు ఇంద్రభవనాన్నే తలదన్నేలా ఉంటుంది. ముంబైలో రిచ్ లొకాలిటీ అయిన ఆల్టామౌంట్ రోడ్ లో ఉన్న అంబానీ ఇంటి నిర్మాణానికి అల్ట్రా మోడ్రన్ టెక్నాలజీని ఉపయోగించారు. అందులోని వసతులు, ఇంటీరియర్ వారెవ్వా అనిపిస్తాయి. అయితే కోట్లు పెట్టి కట్టిన ముఖేష్ అంబానీ ఇంట్లో ఏసీ మాత్రం లేదట. అంత పెద్ద బిల్డింగ్ లో ఎక్కడా ఏసీ కనిపించదట. ఇంతకీ అంబానీ ఇంట్లో ఏసీ ఎందుకు లేదు..? మరి ముంబై వేడి నుంచి వారికి ఉపశమనం ఎలా కలుగుతుంది. ముఖేష్ అంబానీ బిజినెస్లోనే కాదు.. ఇంటి నిర్మాణం విషయంలోనూ డిఫరెంట్గా ఆలోచించారు.

అందరు బిలియనీర్లలా కాకుండా తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. ఇంద్రభవనమే వెలవెలబోయేలా ఉండే అంబానీ ఇంట్లో సకల వసతులతో పాటు పర్యావర పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు. ముకేష్ అంబానీ నివసించే ఇంటి పేరు యాంటిలియా. ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన నివాస భవనం ఇది. 2006లో యాంటిలియా ప్లాన్ రెడీ అయింది. చికాగోకు చెందిన ఆర్కిటెక్ట్ పెర్కిన్స్ ఈ బిల్డింగ్ డిజైన్ చేయగా.. ఆస్ట్రేలియాకు చెందిన నిర్మాణ రంగ సంస్థ లైయిటన్ హోల్డింగ్స్ నిర్మాణం చేపట్టింది. 173 మీటర్ల పొడవు, 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 27 అంతస్తులుంటాయి. బిల్డింగ్ నిర్మాణం 2008లో ప్రారంభంకాగా.. 2010లో పూర్తైంది. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం ఈ ఇంటి నిర్మాణానికి అప్పట్లోనే 12వేల కోట్లు ఖర్చు అయిందట. తీవ్ర భూకంపాలు వచ్చినా తట్టుకునేలా యాంటిలియాను రూపొందించారు. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా ఈ బిల్డింగ్ తట్టుకుని నిలబడుతుంది. 27 అంతస్తుల్లో నిర్మించిన యాంటిలియా విలువ ఇప్పుడు 15వేల కోట్ల పైమాటేనని అంచనా. యాంటిలియాలో ఉన్నది 27 అంతస్థులే అయినా చూసేందుకు మాత్రం 40 ఫ్లోర్ల బిల్డింగ్లా కనిపిస్తుంది. అందుకు కారణం ఒక్కో ఫ్లోర్ ఎత్తు దాదాపు రెండు అంతస్థులంత ఉండటమే. గ్రాండ్ ఎంట్రెన్స్, విలాసవంతమైన లివింగ్ రూమ్స్ కలిగిన ఈ భవనం.. బకింగ్ హాం ప్యాలెస్ తర్వాత అత్యంత ఖరీదైన బిల్డింగ్ గా నిలిచింది. ప్రపంచంలోని నివాస భవనాలన్నింటిలో యాంటిలియా ప్రత్యేకమే కాదు.. విభిన్నం కూడా. అందులోని ప్రతి ఫ్లోర్ విభిన్నమైన మెటీరియల్ తో నిర్మించారు. యాంటిలియాలోని ప్రతి అంతస్థుకు ఓ కథ ఉంది. ప్రతి ఫ్లోర్ వాస్తు, డిజైన్, ఇంటీరియర్ భారతీయతను ప్రతిబింబించేలా ఉంటాయి.

మరిన్ని వీడియోల కోసం

సూర్యుడికి సోదరుడు ఉన్నాడా..?వీడియో

ప్లేటు నిండా రొయ్యల కర్రీ..తినాలంటే వర్రీ వీడియో

క్రమం తప్పకుండా స్కూలుకి వస్తూ.. కొండముచ్చు ఏం చేస్తుందో చూడండి