రైల్వేస్టేషన్‌లో ఊహించని ఘటన.. ప్లాట్‌ఫామ్ నుంచి జారి రైలు కిందపడ్డ కుక్క
రైల్వేస్టేషన్‌లలో ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. రైలు రన్నింగ్‌లో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కిందపడిపోతుంటారు. అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోనే తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇక్కడ ఓ మనిషి నిర్లక్ష్యం కారణంగా కుక్క ప్రాణాల మీదకు వచ్చింది.
ఓ రైల్వే స్టేషన్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్ కదులుతుండగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను నిర్లక్ష్యంగా ఈడ్చుకెళ్లి రైలు ఎక్కించబోతాడు. అయితే రైలు వేగం పెరగడంతో ఆ కుక్క రైలు ఎక్కలేకపోతుంది. కుక్క యజమాని బలవంతంగా దాని పట్టీని లాగి ప్లాట్‌ఫారమ్ వెంట లాగుతాడు. దీంతో అక్కడ విషాద సంఘటన చోటుచేసుకుంది. కుక్కకు కట్టిన బెల్ట్ ఊడిపోవడంతో ఆ మూగజీవి రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య గ్యాప్‌లోకి పడిపోతుంది. ఆ హృదయ విదారక దృశ్యాలు నెటిజన్స్‌ను కలిచి వేస్తున్నాయి. రైలు కదులుతూనే ఉండగా, ఆ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం తీవ్రంగా వెతికాడు. సంఘటన భయంకరంగా ఉంది. అయితే ఆ కుక్క ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనను జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ప్రమాదానికి యజమానిని బాధ్యునిగా పేర్కొంటూ కామెంట్ల రూపంలో దుమ్మెత్తిపోస్తున్నారు. కుక్క పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ వస్తువులను ముట్టుకున్నారా? వెంటనే చేతులు కడుక్కోండి.. లేదంటే..
చొక్కాలు విప్పి.. ‘ఎక్స్‌ప్రెస్ వే’ పై ఓవరాక్షన్
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

