తాజ్ మహల్ బంగారు కిరీటం ఏమైంది? వీడియో
తాజ్ మహల్.. ఈ పేరు వినగానే ఓ ప్రేమికుని మధుర స్వప్నం గుర్తొస్తుంది. మొఘల్ బాదుషా షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి. 33 మంది ప్రసిధ్ధ శిల్పులు, కొన్నివందల మంది కూలీలు 20 ఏళ్లు రాత్రింబవళ్లు కష్టపడి నిర్మించిన పాలరాతి కట్టడం.. ఓ ఆర్కిటెక్చర్ అద్భుతం. ఆగ్రాలో యమునా నది తీరాన వెలిసిన ఈ కట్టడం శతాబ్దాలు గడిచినా ధవళకాంతితో మెరిసిపోతుంది. తాజ్ మహల్ నిర్మించి వందల ఏళ్లు పూర్తైనా దాని రాజసం మాత్రం చెక్కు చెదరలేదు. అయితే తాజ్ మహల్ మధ్యన ఉన్న గోపురంపై ఏర్పాటు చేసిన ఓ బంగారు స్థూపం తాజ్ అందాన్ని ద్విగుణీకృతం చేసేదట. ఇప్పటికీ గోపురంపై ఓ స్థూపం కనిపిస్తున్నా అది అసలైనది కాదని చరిత్రకారులు అంటున్నారు. ఇంతకీ తాజ్ మహల్ గోపురంపై కిరీటంలా ధగధగ మెరిసే ఆ స్థూపం ఏమైంది.? దాని స్థానంలో బంగారు పూత పూసిన రాగి స్థూపం ఎలా వచ్చింది..?
భార్య స్మృతి చిహ్నంగా నిర్మించిన తాజ్ మహల్ ను అందంగా తీర్చిదిద్దేందుకు షాజహాన్ బాగానే కష్టపడ్డాడు. ఇందులో భాగంగా వివిధ దేశాల నుంచి శిల్పుల్ని రప్పించాడు. వాస్తు శాస్త్ర నిపుణుల పర్యవేక్షణలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణం చేపట్టాడు. పచ్చలు, పుష్యరాగాలు, కెంపులు, రవ్వలు, ఇలా ఒకటేమిటి ప్రపంచం నలుమూలల నుంచి విలువైన, మేలిమి వస్తువులను సమకూర్చి తాజ్ మహల్లో పొదిగించాడు. షాజహాన్ కాలం నాటి చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లాహోరీ ప్రకారం తాజ్ మహల్ నిర్మాణానికి అప్పట్లో 50లక్షల రూపాయలు ఖర్చైందట. అయితే కొందరు చరిత్రకారులు మాత్రం అది కేవలం కూలీలకు ఇచ్చిన వేతనం మాత్రమేనని అంటారు. ఆగ్రాలో దొరికిన కొన్ని పత్రాల ప్రకారం తాజ్ మహల్ నిర్మాణానికి అప్పట్లోనే 4 కోట్లు ఖర్చు అయిందట. ఆ మొత్తాన్ని సమకూర్చేందుకు షాజహాన్ ప్రభుత్వ, ఆగ్రా ఖజానా మొత్తాన్ని ఖాళీ చేశారట. తాజ్ మహల్ నిర్మాణం పూర్తయ్యాక దాని పర్యవేక్షణ, సంరక్షణ కోసం ఆగ్రా చుట్టుపక్కలున్న 30 గ్రామాల నుంచి వచ్చే ఆదాయాన్ని వినియోగించాలని షాజహాన్ ఆదేశించారట.
మరిన్ని వీడియోల కోసం
సూర్యుడికి సోదరుడు ఉన్నాడా..?వీడియో
ప్లేటు నిండా రొయ్యల కర్రీ..తినాలంటే వర్రీ వీడియో
క్రమం తప్పకుండా స్కూలుకి వస్తూ.. కొండముచ్చు ఏం చేస్తుందో చూడండి

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే

అద్దెకు కూలర్లు..నెలకు రూ.300 నుంచే ప్రారంభం వీడియో

సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంటిలో మొక్కల అద్దె ట్రెండ్
