సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం రైల్వేస్టేషన్లు,బస్‌స్టేషన్లు రద్దీ
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమవడంతో నగరంలో, ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ పెరిగింది. బస్టాండ్‌లు, టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీతో కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నా, ప్రయాణికులకు సీట్లు దొరకక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సుదీర్ఘ ప్రయాణ సమయాలు, రద్దీని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లుకు పయనమయ్యారు. సొంతూళ్లకు వెళ్తున్న వారితో సిటీ అంతటా వాహనాల రష్ కనిపిస్తోంది.రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు పెద్దఎత్తున బారులు తీరాయి. సంక్రాంతి సెలవులు ఉండటంతో పల్లెలకు క్యూకట్టారు ప్రజలు. దాంతో, వేలాది వాహనాలు రోడ్డెక్కాయి.. సంక్రాంతి ప్రయాణికులతో హైదరాబాద్ రహదారులన్నీ శుక్రవారం రాత్రి కిటకిటలాడాయి.. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో జనం పెద్దఎత్తున ఊళ్లకు తరలివెళ్లారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఏపీకి వెళ్తున్న బస్సులతో ట్రాఫిక్ మరింత పెరిగింది. కూకట్‌పల్లి , ఎంజీబీఎస్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ బస్టాండ్లు రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్తున్న వారితో బస్సులు నిండిపోయాయి. బస్టాప్‌ల వద్ద రద్దీగా ఉండడంతో కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపోయాయి. రద్దీకి అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నా సరిపోవడం లేదు. అయితే ఒక్కసారిగా రద్దీ పెరగడంతో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇందులో సాధారణంగా ప్రతిరోజూ నడిచే 180 బస్సులకు తోడు శనివారం ప్రత్యేకంగా మరో 125 అదనపు బస్సులు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొంత మందికి టికెట్స్ రిజర్వేషన్ కాకపోవడం వలన ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. హైదరాబాద్ టు విజయవాడ జర్నీకి సాధారణంగా నాలుగైదు గంటలకు పైగానే పడుతుంది. ఇక, సెలవులు, పండగ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలంటే 10 గంటలకు పైగానే పడుతుంది. సంక్రాంతి వచ్చిందంటే, వాహనాల జాతరే ఉంటుంది. అందుకే, హైవేపై సంక్రాంతి రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం యాక్షన్‌లోకి దిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మీదుగా గుంటూరు, ఖమ్మం, విజయవాడ వెళ్లే వాహనాలు, ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కోకుండా చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

