Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారకపోయినా, అది శ్రీలంక వైపు కదులుతోంది. ఏపీకి తుపాను ముప్పు తప్పినప్పటికీ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా ఏపీలో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే పొగమంచు, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది శుక్రవారం ఉదయంలోగా తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం తొలుత అంచనా వేసింది. కానీ సముద్రంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏపీకి తుఫాను ముప్పు తప్పినట్టయింది. అయితే ఈ తీవ్ర వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంకలో ట్రింకోమలి, జాఫ్నా మధ్యలో శనివారం మధ్యాహ్నానికి తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగండం ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు తమిళనాడు, కేరళలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో తూర్పు తీరంలోని అన్ని పోర్టులకు ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. శని, ఆదివారాల్లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షం కురవొచ్చని పేర్కొంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. మరోవైపు ఏపీలో చలి తీవ్రత పెరుగుతోంది. తీవ్రమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల స్థాయికి పడిపోయాయి. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువకు పడిపోయాయి. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు, వృద్దులు మరింత అప్రమత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా శుక్రవారం పాడేరులో 4.1 డిగ్రీల సెల్సియస్, పెదబయలురో 4.8 డిగ్రీలు, చింతపల్లిలో 5 డిగ్రీలు, కొయ్యూరులో 9.7, హుకుంపేటలో 6.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్ర వాయుగుండం కారణంగా వర్షాలు పడనుండటంతో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే చలి ప్రభావంతో ప్రజలు బయటకు రావడమే మానేశారు. ఉదయమే కాకుండా మధ్యాహ్న వేళల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

