Iran Protest: నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్ !!
ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, కరెన్సీ పతనం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. టెహరాన్ నుండి దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలతో ఘర్షణల్లో మరణాలు, అరెస్టులు చోటుచేసుకున్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీ రాజీనామాకు డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ బంద్‌తో పాటు ప్రభుత్వ వ్యతిరేక చర్యలు ఉధృతమయ్యాయి.
ఇరాన్‌లో ప్రజాందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. పెరిగిన ధరలు, తీవ్రంగా పడిపోయిన కరెన్సీ విలువతో ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి నిరసనగా రాజధాని టెహరాన్‌లో ప్రారంభమైన ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించి హింసాత్మకంగా మారాయి. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏడుగురు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై రాళ్లు రువ్వగా, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. కొన్నిచోట్ల పరిస్థితులు చేయిదాటిపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. శాంతికి విఘాతం కలిగించారనే ఆరోపణలతో పశ్చిమ టెహరాన్‌లోని మలార్డ్ జిల్లాలో 30 మంది, కుహ్‌దాష్ట్ నగరంలో 20 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలంటూ ఆ దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమకు స్వేచ్ఛ కావాలంటూ ప్రజలు రోడ్లపై నిరసన బాట మరింత ఉధృతంగా మారింది. గత వారం రోజులుగా చేస్తున్న వారి నిరసన అంతకంతకూ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెబుతూ తీవ్రతరమయ్యింది. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. మిడ్డీలు, స్కర్టులు వేసుకున్న అమ్మాయిలు.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. శాంతియుతంగా నిరసనలు దిగిన ప్రజలపై హింసాత్మక చర్యలకు దిగితే వారికి మద్దతుగా నిలబడతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన బెదిరింపుపై సుప్రీం నేత అలీ ఖమేనీ మండిపడ్డారు. ఇరానియన్ల రక్తంతో చేతులు తడుపుకున్నారంటూ ట్రంప్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ట్రంప్ కోసమే కొందరు వీధుల్లోకి వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల వ్యవహారాల గురించి ఆలోచించడానికి బదులుగా ట్రంప్ తన దేశం గురించి ఆలోచించడం మంచిదని సలహా ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

