AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒరెష్నిక్' విలయం.. వణికిపోయిన ఉక్రెయిన్

ఒరెష్నిక్’ విలయం.. వణికిపోయిన ఉక్రెయిన్

Phani CH
|

Updated on: Jan 10, 2026 | 5:45 PM

Share

రష్యా అధునాతన హైప‌ర్‌సోనిక్ ఒరెష్నిక్ క్షిప‌ణిని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ధ్వ‌ని వేగం కన్నా 10 రెట్లు వేగంగా దూసుకెళ్లే ఈ బాలిస్టిక్ మిస్సైల్ లివివ్‌లోని డ్రోన్ ఉత్పత్తి కేంద్రాలను, సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడికి ప్రతీకారంగానే ఈ ప్రయోగం జరిగినట్లు రష్యా ప్రకటించింది. అణ్వాయుధ సామర్థ్యం గల ఈ క్షిపణి ఉక్రెయిన్‌కు తీవ్ర నష్టం కలిగించింది.

ర‌ష్యా ఒరెష్నిక్ మిసైల్‌ను ప్ర‌యోగించింది. ఆధునిక టెక్నాల‌జీతో తయారైన ఈ క్షిప‌ణి ధ్వ‌ని వేగం క‌న్నా వేగంగా 13 వేల కి.మీ స్పీడ్‌తో ప్రయాణించటం దీని ప్రత్యేకత. దీనిని హైప‌ర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ గా పిలుస్తారు. ఉక్రెయిన్‌లోని లెవివ్ న‌గ‌రంలో ఉన్న డ్రోన్ ఉత్ప‌త్తి కేంద్రాల‌ను క్షిప‌ణి టార్గెట్ చేసింది. ప్రత్యర్థుల మిలిట‌రీ కేంద్రాల‌ను కూడా ఆ మిస్సైల్‌తో పేల్చి వేసిన‌ట్లు రష్యా ప్రకటించింది. ఈ దాడి తర్వాత ఉక్రెయిన్‌లోని కీవ్‌లో నలుగురు మృతి చెందగా 25 మంది గాయపడ్డారు. డిసెంబరు 28న రష్యాలోని నొవోగొరాడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ ఇంటిపై డ్రోన్ అటాక్ జ‌రిగింది.ఆ డ్రోన్లు అన్నింటినీ రష్యన్ దళాలు నేలకూల్చాయి. కాగా, నాటి దాడికి ప్రతీకారంగానే ర‌ష్యా త‌న ఓరెష్నిక్‌ క్షిప‌ణిని ప్రయోగించిందని రష్యన్ ర‌క్ష‌ణ‌శాఖ ప్రకటించింది. తాజాగా ర‌ష్యా త‌న ఒరెష్నిక్ మిస్సైల్‌తో పాటు 13 ఇత‌ర బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను త‌మ‌పై ప్రయోగించినట్లు జెలెన్‌స్కీ అన్నారు. వీటితో పాటు మ‌రో 22 క్రూయిజ్ మిస్సైళ్లు, 242 డ్రోన్లను కూడా ర‌ష్యా వ‌దిలిన‌ట్లు చెప్పారు.లివివ్ ప్రాంతంలో ఒరెష్నిక్ క్షిప‌ణి దాడికి సంబంధించిన ఓ వీడియో వైర‌ల్ అయ్యింది. పోలాండ్ బోర్డ‌ర్ స‌మీపంలో ఆ మిస్సైల్ పేలింది. అయితే ఆ క్షిప‌ణి ప్ర‌యోగించిన స‌మ‌యంలో అనేక ప్రొజెక్టైల్స్ విడుదలైన దృశ్యాలు ఆ వీడియోలో క‌నిపించాయి. లివివ్‌కు 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న అండ‌ర్‌గ్రౌండ్ గ్యాస్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఒరెష్నిక్ క్షిప‌ణి పేల్చినట్లు భావిస్తున్నారు. అణ్వాయుధ సామ‌ర్థ్యం ఉన్న ఆ బాలిస్టిక్ క్షిప‌ణిని ర‌ష్యా రెండో సారి ఉపయోగించింది. 2024లో ఉక్రెయిన్‌లోని డీప్న‌ర్ సిటీపై దాన్ని వాడింది. 2025 చివ‌ర‌లో బెలార‌స్‌పై కూడా ర‌ష్యా క్షిప‌ణిని వాడిన‌ట్లు తెలుస్తోంది. ఒరెష్నిక్ క్షిప‌ణిని తోక‌చుక్క‌తో పోల్చారు పుతిన్‌. మ‌ల్టిపుల్ టార్గెట్ల‌ను పేల్చ‌గ‌ల వార్‌హెడ్స్‌ను అది ఒకేసారి మోసుకెళ్తుంద‌ని ఆయ‌న గ‌తంలో అన్నారు. ఆ క్షిప‌ణి టార్గెట్‌లో ఉన్న ప్ర‌దేశం దుమ్ముదుమ్ము అవుతుంద‌న్నారు. ధ్వ‌ని వేగం క‌న్నా ప‌ది రెట్ల వేగంతో ఆ క్షిప‌ణి ప్ర‌యాణిస్తుంది.ఒరెష్నిక్‌ను ఇంట‌ర్‌మీడియ‌ట్ రేంజ్ క్షిప‌ణిగా పిలుస్తారు. ఇది 5500 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌గ‌ల‌దు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్

గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?

కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్