Trump: గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. దాని అపారమైన ఖనిజ సంపద, వ్యూహాత్మక ప్రాముఖ్యత లక్ష్యం. అవసరమైతే సైనిక చర్యకు కూడా అమెరికా సిద్ధంగా ఉందని వైట్‌హౌస్ ప్రకటించడంతో డెన్మార్క్‌తో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ చర్య నాటో కూటమి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందని డెన్మార్క్ హెచ్చరించింది. యూరోపియన్ దేశాలు డెన్మార్క్‌కు మద్దతు పలికాయి.
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగం సిద్దం చేస్తున్నారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం కోసం అమెరికా సైన్యాన్ని ఉపయోగించుకునే అవకాశం ఎప్పటికీ అధ్యక్షుడికి ఉంటుందని వైట్ హౌస్ ప్రకటించింది. దీంతో వైట్ హౌస్ వ్యాఖ్యలతో నాటో సభ్య దేశమైన డెన్మార్క్‌తో అమెరికాకు తలెత్తిన ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యాయి. గ్రీన్‌లాండ్ అమెరికాలో భాగంగా మారాల్సిందేనని, అది తమ జాతీయ భద్రతకు అవసరమని భావించిన ట్రంప్ కబ్జాకు పావులు కదుపుతున్నారు.దానిపై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని, వాటిల్లో సైన్యాన్ని వాడే అంశం కూడా పరిశీలనలో ఉందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొనడం ప్రపంచ రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. ఇప్పటికే వెనెజువెలా నేత నికోలస్ మదురోను సైనిక ఆపరేషన్ ద్వారా అమెరికా కస్టడీలోకి తీసుకున్నది. అప్పటినుంచి గ్రీన్‌లాండ్ పేరు వార్తల్లో వినిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. తమ దేశంలోని గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటే, నాటో సైనిక కూటమి ఉనికి ముగిసిపోతుందని డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి డెన్మార్క్ ప్రధానమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యల వల్ల రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి తమకు భద్రతను కల్పిస్తున్న నాటో కూటమి ఉనికి ప్రశ్నార్ధకంగా మారే ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ఒకవేళ అమెరికా తమపై దాడికి పాల్పడితే, ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మరో వైపు యూఎస్ బెదిరింపుల నేపథ్యంలో డెన్మార్క్‌కు యూరోపియన్ దేశాలు మద్దతు ప్రకటించాయి. గ్రీన్ ల్యాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం. దీని విస్తీర్ణం 20 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా, జనాభా కేవలం 57,000 మాత్రమే. ఇది భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నప్పటికీ, యూరోప్‌లోని డెన్మార్క్ ఆధీనంలో ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రావిన్స్. విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, సహజ వనరులు మాత్రం డెన్మార్క్ నియంత్రణలో ఉంటాయి. ఈ ద్వీపంలోని 85 శాతం భూభాగంపై 3 కిలోమీటర్ల మందంతో మంచు కప్పుకుంది. గ్రీన్ ల్యాండ్ అపారమైన ఖనిజ సంపదకు నిలయం. ఇక్కడ రాగి, లిథియం, అరుదైన ఎర్త్ మెటల్స్, ఇనుము, యురేనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్ ల్యాండ్ ఖనిజ సంపద విలువ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లుగా అంచనా. ప్రపంచ అరుదైన లోహ నిక్షేపాల్లో 25 శాతం ఇక్కడే ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో గ్రీన్ ల్యాండ్ పై అమెరికా కన్నేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు ట్రైలర్.. పక్కా పండగ బొమ్మ
విజయ్, ప్రభాస్ కూడా ఆ భామ తర్వాతే.. ఒక చిత్రం తో సంచలనం
Megastar Chiranjeevi: మరోసారి దర్శకులకు క్లాస్ తీసుకున్న మెగాస్టార్
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

