AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ బాంబ్.. మరో బాదుడుకు రంగం సిద్ధం

భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ బాంబ్.. మరో బాదుడుకు రంగం సిద్ధం

Phani CH
|

Updated on: Jan 09, 2026 | 10:15 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500% సుంకాలు విధించే బిల్లుకు ఆమోదం తెలిపారు. సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ ప్రతిపాదించిన ఈ బిల్లు భారత్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే భారత్‌పై 50% సుంకాలున్నాయి, అవి 500%కు పెరిగే ప్రమాదముంది. ఈ పరిణామం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి సుంకాల దాహం తీరలేదు. భారత్‌పై కనీవినీ ఎరుగని రీతిలో భారీ సుంకాలకు అమెరికా కసరత్తు చేస్తోంది. 500 శాతం సుంకాలు మోపేందుకు అమెరికాలో బిల్లు సిద్ధం అవుతోంది. సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ ప్రతిపాదించిన బిల్లుకు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. వచ్చేవారం సెనెట్‌లోకి సుంకాల బిల్లు రానుంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసే దేశాలపై 500% సుంకాలు విధించడానికి ట్రంప్‌కు అధికారాలు కల్పించింది బల్లు. ఈ బిల్లు అమెరికా ఎగువసభ ఆమోదిస్తే భారత్‌పై భారీసుంకాల భారీ పడే ఛాన్స్‌ ఉంది. భారత నుంచి వచ్చే వస్తువులపై ఇప్పటికే 50 శాతం సుంకాలు బాదేశారు. ఈ 50 శాతం కాస్తా 500 శాతంగా మారేందుకు అమెరికా నుంచి డేంజర్‌ సిగ్నల్స్‌ వస్తున్నాయి. రష్యాను ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక తికమకపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అటునుంచి నరుక్కొస్తున్నారు. రష్యాలో బల్బు వెలగాలంటే భారత్‌లో స్విచ్‌ వేయాలని అనుకుంటున్నారు. అనుకోవడమేంటీ, ఆచరణలో పెట్టేశారు. సునామీ రేంజ్‌లో సుంకాలను బాదేస్తున్నారు. పుతిన్‌తో చెట్టాపట్టాల్‌ వేసుకుంటున్నారంటూ మోదీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇందులోభాగమే సుంకాల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ట్రంప్‌కు పార్టీ అయిన రిపబ్లికన్‌ పార్టీ నుంచి సెనెట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లిండ్సే గ్రాహమ్‌ తీసుకొచ్చిన బిల్లు హాట్‌టాపిక్‌ అవుతోంది. రష్యా నుంచి యురేనియంగానీ, పెట్రోలియమ్‌ ఉత్పత్తులుగానీ కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు 500 శాతం సుంకాలు విధించవచ్చని ఈ బిల్లు చెబుతోంది. భారత్‌, చైనా, బ్రెజిల్‌ను ఈ కొత్త బిల్లు ద్వారా టార్గెట్‌ చేశారు. రష్యా నుంచి ముడిచమురు కొంటే సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదేపదే వార్నింగ్‌లు ఇస్తూ వస్తున్నారు. అంతకాదు, భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తూత్పత్తులపై 50 శాతం ప్రతీకార సుంకాలను అమెరికా ఇప్పటికే విధించింది. గత ఏప్రిల్‌, ఆగస్ట్‌ నెలల్లో రెండుదఫాలుగా ఈ సుంకాలు విధించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

సంక్రాతికి దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు అలెర్ట్!

‘ఆధార్‌’ అక్రమాలకు అడ్డుకట్ట.. కొత్త డిజిటల్ యాప్ వచ్చేసింది

అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..

సంక్రాంతికి లగ్జరీ కారవాన్‌లో జాలీ ట్రిప్.. ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీ రెడీ