మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో శీతాకాలంలో అద్భుతమైన 'మంచు సునామీ' ఏర్పడింది. గడ్డకట్టిన నది మంచును చీల్చుకుంటూ ప్రవాహంలా దూసుకుపోగా, చెట్లపైనున్న మంచు సైతం పడింది. పర్యాటకులు రికార్డు చేసిన ఈ భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వింత ప్రకృతి దృగ్విషయం శీతాకాల తీవ్రతను చాటిచెబుతోంది.
శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా మంచు కురుస్తోంది. ఇక, శీతాకాలంలో మంచు తుఫానులు ఏర్పడటం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. మరి మంచు సునామీలను మీరు ఎప్పుడైనా చూశారా! చైనాలో మంచు సునామీ వచ్చింది. జిన్‌జియాంగ్ ప్రాంతంలో ఓ నదిలో ‘మంచు సునామీ’ అలలు ఏర్పడ్డాయి. గడ్డకట్టిన నది ఉన్నట్టుండి మంచు గడ్డలను చీల్చుకుంటూ ఉప్పొంగింది. మంచు కరిగి ప్రవాహంలా దూసుకెళ్లింది. చెట్లపై ఉన్న మంచు సైతం ఒక్కసారిగా కిందకు పడింది. శీతాకాలం కావడంతో పూర్తిగా మంచుతో పేరుకుపోయిన నదిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఈ దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ భయానక దృష్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే, ఇది కచ్చితంగా ఏ ప్రాంతంలో ఏర్పడిందన్నది తెలియరాలేదు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పూరి-తిరుపతి రైలులో అగ్నిప్రమాదం
దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

