AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన

రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన

Phani CH
|

Updated on: Jan 09, 2026 | 5:52 PM

Share

బెంగళూరులో జీవన వ్యయం విపరీతంగా పెరుగుతోందని ఓ యువతి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. రూ.500 కూడా రూ.50లా అనిపిస్తోందని, నెలవారీ ఖర్చులు, అద్దెలు భరించలేని స్థితికి చేరాయని తెలిపింది. 'ఇండీడ్' సర్వే ప్రకారం, 93% మంది ఉద్యోగులు ప్రస్తుత జీతాలతో జీవనం కష్టం అంటున్నారని, కనీసం లక్ష సంపాదన ఉంటేనే బెంగళూరులో నివసించగలరని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

బెంగళూరులో పెరుగుతున్న జీవ‌న వ్య‌యంపై ఓ యువ‌తి సోష‌ల్ మీడియా వేధిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేసింది. బెంగళూరులో రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తోందని, స్నాక్స్ కొనుగోలు చేసినా అంతే అంటూ తెలిపింది. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ళామంటే రూ.500 ఊరికే ఖ‌ర్చు అవుతున్నాయ‌ని చెప్పింది. ఇంట్లో ఉన్నా కూడా అలాగే ఖ‌ర్చు అవుతున్నాయ‌ని, స్నాక్స్ తిన్నా కూడా భారీగా రేట్లు ఉన్నాయ‌ని తెలిపింది. ఇక్క‌డ ఊపిరి తీసుకోవ‌డం క‌ష్ట‌మో లేదో కానీ, మీ ప‌దిశాతం ఇంక్రిమెంట్ మాత్రం ఖ‌ర్చు అవుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. బెంగ‌ళూరులో మ‌రీ జీవ‌న వ్య‌యం ఇంతలా ఎందుకు పెరుగుతోంది అంటూ వాపోయింది. ఐటీ హ‌బ్ గా మారిన బెంగళూరులో రోజురోజుకు ఖ‌ర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవాల‌నుకున్నా రూ.20వేల‌కు పైగానే ఉంది. ఇక తాజాగా యువ‌తి పోస్ట్‌ వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు సైతం అది నిజ‌మే అని చెబుతున్నారు. బెంగ‌ళూరులో బ‌తకాలి అంటే క‌నీసం రూ.1 ల‌క్ష సంపాదించాల‌ని అప్పుడే బెంగళూరుకు రావాల‌ని కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా నగరంలోని అధిక అద్దెలు, ట్రాఫిక్, లైఫ్‌స్టైల్‌పై నెటిజన్లు అభిప్రాయాలు షేర్‌ చేస్తున్నారు. ‘ఇండీడ్’ సంస్థ నిర్వహించిన ‘పే మ్యాప్ సర్వే’లో పెరుగుతున్న జీవన వ్యయానికి జీతం సరిపోతుందా అని ప్రశ్నించగా, మొత్తం ఉద్యోగులలో 69 శాతం మంది ‘లేదు’ అని సమాధానం ఇచ్చారు. బెంగళూరులో 93% మంది ఉద్యోగులు జీవన వ్యయం భరించలేని స్థాయిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నగరాల్లో నివాస ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్లనే చిన్న గ్రామాలు, పట్టణాల నుంచి.. ఎక్కువ మంది యువత అక్కడికి వలస రావడానికి వెనకాడుతున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముందుకు కదలకుండా ఆగిన అతిపెద్ద శివలింగం

ఇరవైల్లోనే రూ. 9 కోట్ల ఇంటిని సొంతం చేసుకుంది

గురువారం అర్ధరాత్రి 12 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారం క్లోజ్‌

నౌక పెట్టిన అగ్గి మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ??

వెనిజులా అధ్యక్షుడు, అతడి భార్యను ఎలా బంధించారంటే ?? ఏఐ వీడియో