గురువారం అర్ధరాత్రి 12 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారం క్లోజ్
తిరుమల శ్రీవారి ఆలయంలో పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలు నేటి అర్ధరాత్రి ముగియనున్నాయి. డిసెంబరు 30న ప్రారంభమైన దర్శనాల్లో లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రద్దీకి తగ్గట్టు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. చివరి రోజుల్లోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకునే సువర్ణావకాశం ముగుస్తుంది.
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో నేటి ఆర్ధరాత్రి వైకుంఠ ద్వారం మూసుకోనుంది. పది రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో గతేడాది డిసెంబరు 30వ తేదీన ప్రారంభమైన పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ముగియనున్నాయి. పది రోజుల ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ చేసిన టీటీడీ మిగిలిన ఏడు రోజులకు నేరుగా వచ్చే సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇదే సమయంలో పరిమిత సంఖ్యలో శ్రీవాణి, రూ.300 టికెట్లు, వీవీఐపీల బ్రేక్, స్థానికులకు ఈ-డిప్‌లో రోజుకు ఐదు వేల చొప్పున టోకెన్లు జారీ చేసింది. రద్దీకి అనుగుణంగా అధికారులు ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షించారు. క్యూలైన్‌లోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందించారు. శ్రీవారిని ఎనిమిదోరోజు మంగళవారం వైకుంఠ ద్వారంలో 82,022 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ.3.48 కోట్లు వచ్చాయి. 20,230 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తొమ్మిదో రోజు బుధవారం రద్దీ కొనసాగింది. రింగురోడ్డులోని శిలాతోరణం నుంచి భక్తులను క్యూలైన్‌లోకి అనుమతించారు. సాయంత్రానికి 51,000 మంది భక్తులు దర్శనం చేసుకోగా క్యూలైన్‌లో వేచి ఉన్న మిగిలినభక్తులకు 15 గంటల్లో దర్శనం పూర్తికానుందని టీటీడీ ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నౌక పెట్టిన అగ్గి మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ??
వెనిజులా అధ్యక్షుడు, అతడి భార్యను ఎలా బంధించారంటే ?? ఏఐ వీడియో
జేఎఫ్-17 యుద్ధ విమానాలపై.. దోస్త్ మేరా దోస్త్
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

