వెనిజులా అధ్యక్షుడు, అతడి భార్యను ఎలా బంధించారంటే ?? ఏఐ వీడియో
నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించినట్లు చూపే ఒక AI జనరేటెడ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మదురో నివాసంపై పేలుళ్లు, సైనిక చర్య దృశ్యాలున్నాయి. మన్‌హట్టన్ కోర్టులో మదురో తనను ఇంటి నుండి బంధించారని, తాను అమాయకుడినని వాదించారు. ఈ వైరల్ వీడియో లక్షలాదిమందిని ఆకర్షించింది. మదురో అరెస్ట్, అమెరికా పాత్రపై చర్చకు దారితీసింది.
వెనిజులా పదవీచ్యుత అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా గడ్డపై బందీగా ఉన్నా ఏమాత్రం జంక లేదు. ‘తాను వెనిజులా అధ్యక్షుడినని, కారకాస్‌లోని తన ఇంట్లో ఉండగా బంధించి తీసుకువచ్చారని, తానెలాంటి తప్పూ చేయలేదని, తను అమాయకుడిని, మర్యాదస్తుడిని అంటూ సోమవారం మన్‌హట్టన్ కోర్టులో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఆయనను అమెరికా సైన్యం బంధించి తీసుకెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌లను అమెరికా సైన్యం ఒక ఆపరేషన్ ద్వారా ఎలా పట్టుకుందో తెలుపుతూ ఒక ‘ఏఐ’ జనరేటెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోద్వారా, మదురో నివాసం వద్ద పేలుళ్లు జరిగినట్లు, అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మదురో తన నివాసంలోని టెర్రస్‌పై చేతిలో గ్లాసు పట్టుకుని ఏదో తాగుతూ ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో ఆయన భార్య అక్కడకి వస్తుంది. అప్పుడు అమెరికా సైన్యానికి చెందిన విమానాలు అక్కడకు చేరుకుని, వారి నివాసాన్ని చుట్టుముట్టినట్లుగా వీడియోలో ఉంది. విమానంలోని సిబ్బంది లక్ష్యాన్ని చేరుకున్నట్లు ట్రంప్‌కు చెబుతున్నట్లు కూడా ఉంది. ఆ తర్వాత బాంబులు జారవిడుస్తారు. ప్రమాదాన్ని పసిగట్టిన మదురో తన భార్యతో కలిసి సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే నివాసంలోకి ప్రవేశించిన అమెరికా బలగాలు మదురో సెక్యూరిటీ అధికారిని కాల్చి చంపి, దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకుంటాయి. నెట్టింట వైరల్ అయిన ఈ ఏఐ జనరేటెడ్ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జేఎఫ్-17 యుద్ధ విమానాలపై.. దోస్త్ మేరా దోస్త్
పెద్ద మొత్తంలో బంగారం.. స్విట్జర్లాండ్‌కు తరలించిన మదురో
డోపింగ్ టెస్టులో పట్టుబడ్డ క్రికెటర్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

