ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
పుణేలో అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన ఇద్దరు స్నేహితులు ఆహారం ఆర్డర్ చేసి తెలివిగా బయటపడ్డారు. డెలివరీ ఏజెంట్ సహాయంతో ఇంట్లో ప్రవేశించారు. తల్లిదండ్రులు నిద్రలేవకుండా జాగ్రత్తపడిన వీరి వీడియో వైరల్ అయింది. నెటిజన్లు ఆ డెలివరీ ఏజెంట్‌ను హీరోగా ప్రశంసిస్తున్నారు, ఇది సమయస్ఫూర్తికి నిదర్శనం అంటున్నారు.
పుణేలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. అర్ధరాత్రి ఇంటి బాల్కనీలో చిక్కుకుపోయిన ఇద్దరు స్నేహితులు ఓ డెలివరీ ఏజెంట్ సహాయంతో ఇంట్లోకి రాగలిగారు . ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మిహిర్ గహుకర్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి వారి ఇంటి బాల్కనీలో మాట్లాడుకుంటూ ఉన్నారు. టైమ్ అర్ధరాత్రి దాటి 3 గంటలవుతోంది. ఇక ఇంట్లోకి వెళ్దామనుకుని డోర్ ఓపెన్ చేయడగా బాల్కనీ డోర్ అనుకోకుండా లాక్ అయిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉండటంతో వారిని లేపినా లేవలేదు. దాంతో ఇక వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేని ఆ మిత్రులు ఏం చేయాలో తెలియక అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇంతలో వారికి ఓ ఐడియా వచ్చింది. వెంటనే ఆన్‌లైన్ యాప్‌లో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఏజెంట్‌కు వారు తమ పరిస్థితిని వివరించారు. “అర్ధరాత్రి 3 గంటలకు బాల్కనీలోనే చిక్కుకుపోయాం, అందుకే ఇలా చేశాం” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోలో వారు డెలివరీ ఏజెంట్‌కు ఫోన్‌లో సూచనలిస్తూ, ఇంటి తాళం ఎక్కడుందో చెప్పి, శబ్దం చేయకుండా లోపలికి రమ్మని కోరారు. ఆ ఏజెంట్ వారి సూచనలను పాటిస్తూ నెమ్మదిగా ఇంట్లోకి వచ్చి బాల్కనీ డోర్ తీశాడు. అతడిని చూడగానే ఆ స్నేహితులిద్దరూ రిలీఫ్ అయి గట్టిగా నవ్వేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ మీ తల్లిదండ్రులు మేల్కొని అతడిని చూసుంటే పరిస్థితి ఏంటని ఒకరు వ్యాఖ్యానించగా, “ఆ డెలివరీ ఏజెంట్ నిజమైన హీరో, అతడికి మంచి టిప్ ఇవ్వాలి అని మరొకరు ప్రశంసించారు. సమయస్ఫూర్తి, డెలివరీ ఏజెంట్ సహకారం వల్ల ఓ ఇబ్బందికరమైన రాత్రి, నవ్వులు పూయించే సంఘటనగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే
సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ… కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు! వీడియో వైరల్
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

