సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు
సంక్రాంతికి స్వగ్రామం వచ్చిన పాలకొల్లు ఎన్నారై కుటుంబం తిరిగి అమెరికా వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. కృష్ణకిషోర్, ఆశ దంపతులు మరణించగా, పిల్లలు గాయపడ్డారు. ఈ విషాద ఘటన వృద్ధ తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. పండుగ ఆనందం విషాదంగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సంక్రాంతి పండుగ అంటే తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైన పండుగ. దేశవిదేశాల్లో ఎక్కడ ఉన్నా అందరూ సంక్రాంతికి సొంతూరికి వచ్చి కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగ జరుపుకుంటారు. అలా సంక్రాంతికని సొంతూరుకు వచ్చిన ఓ ఎన్నారై కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. పండుగకని వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణకిషోర్, ఆశ దంపతులు అమెరికాలోని ఛార్లెట్ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రతిఏటా సంక్రాంతికి వీరుకుటుంబ సమేతంగా సొంతూరుకి వచ్చి వెళ్తుంటారు. ఈ ఏడాది కాస్త ముందుగానే స్వగ్రామానికి వచ్చారు కృష్ణకిషోర్ కుటుంబం. కుమార్తె శివానికి అమెరికాలో ఉద్యోగం రావడంతో, ఆమె జనవరిలోనే విధుల్లో చేరాల్సి ఉండటంతో డిసెంబరులోనే ఈ కుటుంబం స్వగ్రామానికి వచ్చింది. సొంతూరులో తల్లిదండ్రులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడిపారు. న్యూ ఇయర్ వేడుకలు దుబాయ్‌లో ప్లాన్ చేసుకున్న ఆ కుటుంబం పాలకొల్లులో నాలుగురోజులు గడిపి డిసెంబరు 29న దుబాయ్‌కి వెళ్లారు. అక్కడినుంచి అమెరికాకు తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఊహించని విధంగా వారు అమెరికాలో ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కృష్ణకిషోర్, భార్య ఆశ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కుమార్తె శివానికి శస్త్రచికిత్స చేయగా.. కుమారుడు సుచై ఐసీయూలో ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమాచారం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు దూరంగా ఉంటున్నారనుకున్నామే తప్ప.. ఇలా తిరిగిరానంత సుదూరానికి వెళ్లిపోతారనుకోలేదని కృష్ణ కిశోర్ తండ్రి తాతాజీ, తల్లి వెంకటలక్ష్మి గుండెలవిసేలా విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. వారం కిందటే పాలకొల్లు వచ్చి తమతో ఆనందంగా గడిపిన స్నేహితుడు కృష్ణకిశోర్ ఇకలేడన్న వార్త విని అతడి మిత్ర బృందంలో విషాదం అలముకొంది. దుబాయ్ నుంచి అమెరికా వెళ్లే క్రమంలో వారు ఎక్కాల్సిన విమానం దాటిపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బంధుమిత్రులు ఆవేదన చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ… కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు! వీడియో వైరల్
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
ఏపీలో రైతులందరికీ గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో అకౌంట్లోకి రూ.6 వేలు
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

