AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం

కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం

Phani CH
|

Updated on: Jan 08, 2026 | 12:54 PM

Share

చైనాలో కోతుల ధర ఆకాశాన్ని అంటుతోంది, ఒక్కో కోతికి రూ.25 లక్షల వరకు పలుకుతోంది. బయోటెక్‌ రంగం విస్తరణ, వైద్య పరిశోధనలకు కోతుల అవసరం పెరగడమే దీనికి కారణం. పరిశోధనలకు సరిపడా కోతులు దొరక్కపోవడంతో డిమాండ్ పెరిగి, ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీనికి విరుద్ధంగా భారతదేశంలో కోతులు గ్రామాలకు పెద్ద బెడదగా మారాయి.

ఒక కోతికి 25 లక్షల రూపాయలు… కోతి ఏంటి 25 లక్షలేంటి అని నోరెళ్లబెడుతున్నారా? యస్‌ మీరు వింటున్నది నిజమే.. ఒక కోతికి అక్షరాలా 25 లక్షల రూపాయల ధర పలుకుతోంది. ఇది మన పక్క దేశం చైనాలోని ముచ్చట. డ్రాగన్‌ కంట్రీలో కోతులకు మహా డిమాండ్‌ ఏర్పడింది. రూ.20-25 లక్షలు పెట్టినా ఒక కోతి దొరకడం గగనంగా మారిపోతున్నది. రానున్న కాలంలో వీటి ధర మరింత పెరిగిపోతుందని అంటున్నారు. భారత్‌లో అందుకు రివర్స్‌ ఉంది. కోతుల మందతో గ్రామీణ ప్రాంతాలు తెగ ఇబ్బంది పుడుతున్న రోజులు ఇవి. వనాల నుంచి జనాల మీద పడి కోతులు సర్వం విధ్వంసం చేస్తున్నాయి. పంటపొలాలు మీద పడి రైతులకు తీవ్ర నష్టం మిగుల్చుతున్నాయి. ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కోతుల బెడద నివారణ ఎన్నికల వాగ్దానంగా మారిందంటే కోతుల బెడర ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కోతికి ఇంత చొప్పున వెచ్చించి మరీ వాటిని తిరిగి అడవులకు వాపస్‌ పంపే స్కీమ్‌ నడుస్తోంది. కానీ, చైనాలో మాత్రం అంతా రివర్స్‌గా ఉంది. లక్షలు పెడితే గానీ కొతి దొరకని పరిస్థితి. బయోటెక్‌ సెక్టార్‌ అనూహ్యంగా పెరిగిపోవడమే ఈ కోతుల కొరతకు కారణమని అధికారులు అంటున్నారు. వైద్య పరిశోధనల్లో భాగంగా నిర్వహించే క్లినికల్‌ ట్రయల్స్‌కు పెద్దయెత్తున కోతులు అవసరమవుతాయి. అయితే పరిశోధనలకు అవసరమైన సంఖ్యలో కోతులు లభ్యం కాకపోవడంతో వీటి ధర ఆకాశాన్ని అంటుతున్నది. 2025లో అనేక కొత్త బయో ప్రాజెక్టులు ప్రారంభమైనా కోతుల కొరత కారణంగా పరిశోధనలు మధ్యలోనే ఆగిపోయాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్

గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట

Whatsapp: బీ అలర్ట్‌.. భయపెడుతున్న వాట్సాప్‌ హ్యాక్‌ స్కామ్‌

ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. ఆ దేశం అయితే వణికిపోయేదాన్ని