AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

Phani CH
|

Updated on: Jan 08, 2026 | 12:47 PM

Share

అంబేద్కర్ కోనసీమ యానాం వద్ద గోదావరిలో 24 కిలోల భారీ పండుగప్ప చేప చిక్కింది. అరుదైన ఈ నది చేపను రూ.16 వేలకు విక్రయించారు. ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఈ చేప మెదడు, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పులస తర్వాత మాంసం ప్రియులకు అత్యంత ఇష్టమైనది, దీని రుచి చికెన్ మాదిరిగా ఉంటుంది.

అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లా సమీపంలో ఉన్న యానాం పరిధి దరియాలతిప్ప వద్ద గోదావరిలో ఓ మత్స్యకారుడి గాలానికి 24 కిలోల భారీ పండుగప్ప చేప చిక్కింది. ఇటీవల ఇంత పెద్ద చేప చిక్కలేదని స్థానికులు తెలిపారు. చెరువుల్లో పెంచే పండుగప్ప చేపలు గరిష్ఠంగా ఆరు కిలోల వరకే పెరుగుతాయి. కానీ, ఇది నది చేప కావడంతో ఇంతలా పెరిగింది అంటున్నారు మత్స్యకారులు.. దీని రుచి కూడా ఎక్కువగా ఉంటుంది అని మత్స్యకారులు వివరించారు. ఈ చేపను రూ.16 వేలకు విక్రయించారు.పండుగప్ప చేప మాంసంలో ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయని యానాం మత్స్యశాఖ ఏడీ దడాల గొంతెయ్య చెప్పారు. ఇది మెదడు ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, ఎముకల బలానికి తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. పండుగప్ప చేప సముద్రపు ఉప్పు నీటిలో, మంచినీటి నదులలో పెరగడం వీటి ప్రత్యేకత.. చేపలలో రారాజు అయిన పండుగప్ప చేప మాంసం ప్రియులకు అత్యంత ఇష్టమైన చేప. పులస చేప తర్వాత అత్యంత అమితంగా ఇష్టపడే చేపల్లో పండుగప్ప చేప ఒకటి.. పండుగప్ప చేప ఇగురు పెట్టి ఉంటే చికెన్ తిన్నట్టే ఉంటుందని ఫీల్ అవుతారు నాన్‌వెజ్‌ ప్రియులు.. పులసల సీజన్ అయిపోయిన తర్వాత బంధువులకు బాగా కావలసిన వారికి ఈ పండుగప్ప చేపను పార్సల్ చేసి మరి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, దేశాలకు పంపిస్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇప్పటివరకు పండుగప్ప చేపను తినకపోతే టేస్ట్ చేయండి.. ఎందుకంటే.. ఈ చేప రుచి చాలా బాగుంటుందని మత్స్యకారులు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట

Whatsapp: బీ అలర్ట్‌.. భయపెడుతున్న వాట్సాప్‌ హ్యాక్‌ స్కామ్‌

ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. ఆ దేశం అయితే వణికిపోయేదాన్ని

వేగంగా దూసుకెళ్తున్న రైలు.. రైలుకు వేళాడుతూ యువకుడు

టెన్షన్ పెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం.. ఈ ఏడాది జరిగేది ఇదేనట