AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. ఆ దేశం అయితే వణికిపోయేదాన్ని

ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. ఆ దేశం అయితే వణికిపోయేదాన్ని

Phani CH
|

Updated on: Jan 08, 2026 | 12:33 PM

Share

సింగపూర్‌లో అర్ధరాత్రి ఒంటరిగా నడిచిన భారత మహిళ కృతికా జైన్ వీడియో వైరల్‌గా మారింది. అక్కడ మహిళలకున్న భద్రతను ఆమె ప్రశంసించారు, భారతదేశంలో ఇలాంటి పరిస్థితిని ఊహించలేనని పేర్కొన్నారు. మహిళల భద్రత సింగపూర్‌లో ప్రాథమిక హక్కు అయితే, భారత్‌లో అది విలాసమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వీడియో భారత్, సింగపూర్‌లలో మహిళల రక్షణపై విస్తృత చర్చకు దారితీసింది.

అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వెళ్లగలిగినప్పుడు భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్టని మహాత్మా గాంధీ అన్నారు. భారత్‌లో ఏమోకానీ, సింగపూర్‌లో మాత్రం ఓ భారత మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్తూ.. సింగపూర్ లో అర్ధరాత్రి నిర్భయంగా నడుస్తున్నా.. అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన వెనుక ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవని, తాను ఒంటరిగానే ఉన్నానని ఆమె చెప్పారు. తెల్లవారుజామున 3 గంటలకు నిర్మానుష్యంగా ఉన్న రోడ్లను ఆమె చూపించారు. రోడ్లపై ఎవరూ లేకున్నా తనకు ఎలాంటి భయాందోళన లేదని తెలిపారు. ఇదే పరిస్థితి భారతదేశంలో ఎదురైతే వణికిపోయేదాన్నని, ఇలాంటి పరిస్థితిని కలలో కూడా ఊహించలేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇన్ స్టాలో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. కృతికా జైన్ అనే భారత మహిళ కొంతకాలంగా సింగపూర్ లో ఉంటున్నారు. ఇటీవల ఆఫీసులో తన విధులు పూర్తిచేసుకుని తెల్లవారుజామున 3 గంటలకు ఒంటరిగా ఇంటికి బయలుదేరారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంటికి వెళుతున్నానని కృతికా జైన్ చెప్పారు. ఇదే సమయంలో భారతదేశంలో తాను ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలన్నా భయపడేదాన్నని పేర్కొన్నారు. సింగపూర్ లోని పర్యాటక ప్రాంతాలకన్నా అర్ధరాత్రి మహిళలు కూడా నిర్భయంగా బయటకు వెళ్లగలిగే అవకాశం ఉండటమే తనకు బాగా నచ్చిన విషయమని తెలిపారు. భారత్ లో లాగా భద్రత అనేది సింగపూర్ లో లగ్జరీ కాదని, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే నిత్యావసరం లాంటిదని పేర్కొన్నారు. ఈ వీడియో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. భారత్, సింగపూర్ లలో మహిళల భద్రతపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేగంగా దూసుకెళ్తున్న రైలు.. రైలుకు వేళాడుతూ యువకుడు

టెన్షన్ పెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం.. ఈ ఏడాది జరిగేది ఇదేనట

Published on: Jan 08, 2026 09:30 AM