AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట

భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట

Phani CH
|

Updated on: Jan 08, 2026 | 12:43 PM

Share

భారత యువకుడు నోవా అమెరికాలో హోమ్‌లెస్‌ జంటకు ఆహారం, నీళ్లు అందించి వారి ఆకలి తీర్చిన వీడియో వైరల్‌ అయ్యింది. కొత్త సంవత్సరం రోజున వారి నిస్సహాయ స్థితి చూసి మెక్‌డొనాల్డ్స్‌ భోజనం అందించడంతో ఆ జంట కన్నీళ్లు పెట్టుకుంది. నోవా దాతృత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇది నోవా చేసిన మొదటి సాయం కాదు, గతంలోనూ అతను అనేక మంచి పనులు చేశాడు.

ఇల్లు లేని ఓ హోమ్‌లెస్‌ అమెరికన్ జంటకు భార‌తీయ యువ‌కుడు ఆహారం, నీళ్లు అందించి వారి ఆకలి తీర్చిన వీడియో అందరి హృదయాలను కదిలిస్తోంది. నోవా అనే ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ చేసిన ఈ సాయంపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కొత్త సంవత్సరం రోజున నోవాకు రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో ఓ జంట కనిపించింది. వారి దగ్గరకు వెళ్లి, ముందుగా కొన్ని వాటర్ బాటిళ్లు అందించాడు. ఇంకా ఏమైనా కావాలా? అని అడగ్గా, ఆ జంటలోని వ్యక్తి ఎంతో వినయంగా “మెక్‌డొనాల్డ్స్‌లో ఏదైనా తింటాం” అని కోరాడు. వెంటనే నోవా వారి ఆర్డర్ తీసుకుని, వారికి ఆహారం తెచ్చి ఇచ్చాడు. ఊహించని ఈ సాయానికి ఆ జంట కన్నీళ్లు పెట్టుకుంది. వారు పదేపదే థ్యాంక్స్‌ తెలుపుతూ, గాడ్ బ్లెస్ యూ అని దీవించారు. వీడియోను నోవా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “వీరి వద్ద తాగడానికి నీళ్లు కూడా లేకపోవడం చూసి కన్నీళ్లొచ్చాయి. వారికి సాయం చేయగలగడం నా అదృష్టం” అని క్యాప్షన్ పెట్టాడు. నెటిజన్లు నోవా మంచితనాన్ని ప్రశంసించారు. “డబ్బు ఇస్తే డ్రగ్స్‌కు వాడొచ్చు, కానీ ఆహారం ఇవ్వడం ఉత్తమమైన పని” అని ఒకరు, “ప్రతిచోటా మీలాంటి వారుంటే బాగుండును” అని మరొకరు కామెంట్ చేశారు. నోవా ఇలా సాయం చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో పక్షవాతం బారిన పడిన ఓ మహిళ, భారీ వర్షంలో చిక్కుకుపోగా, ఆమెను తన కారులో ఎక్కించుకుని, సురక్షితంగా ఆమె కుమార్తె ఇంటి వద్ద దింపిన వీడియో కూడా వైరల్ అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Whatsapp: బీ అలర్ట్‌.. భయపెడుతున్న వాట్సాప్‌ హ్యాక్‌ స్కామ్‌

ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. ఆ దేశం అయితే వణికిపోయేదాన్ని

వేగంగా దూసుకెళ్తున్న రైలు.. రైలుకు వేళాడుతూ యువకుడు

టెన్షన్ పెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం.. ఈ ఏడాది జరిగేది ఇదేనట