AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి

మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి

Samatha J
|

Updated on: Mar 12, 2026 | 2:40 PM

Share

"నేను కష్టపడ్డా.. పైకొచ్చా.." అంటూ తనదైన మేనరిజంతో అందరినీ అలరించే మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి రాజకీయాలతో కాదు.. తన 'రెండో పెళ్లి' వేడుకతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. షాక్ అవ్వకండి! ఇది మల్లన్న తన 50 ఏళ్ల వైవాహిక బంధం పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్న 'గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ సెర్మనీ'.

ఇటీవల టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక తమ వివాహ వేడుకకు ‘విరోష్’ అని పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో తన వేడుకకు కూడా ఒక పేరు సూచించాలని మల్లారెడ్డి.. కేటీఆర్‌ను కోరగా, ఆయన తనదైన శైలిలో మల్లారెడ్డి + కల్పన = ‘మల్పాన్న’ అని నామకరణం చేశారు. ఈ పేరు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మల్లన్న తన పెళ్లి వేడుక కోసం ఐదు రోజుల పాటు భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మార్చి 12న సత్యనారాయణ స్వామి వ్రతం. మార్చి 13న మల్లికార్జున స్వామి కళ్యాణం. మార్చి 14 భారీ రేంజ్‌లో ‘సంగీత్’, మార్చి 16న మెహందీ, హల్దీ ఫంక్షన్. మార్చి 19: అంగరంగ వైభవంగా ప్రధాన వివాహ వేడుక. ప్లాన్‌ చేశారు. అంతేకాదు, సంగీత్‌ వేడుక కోసం గత వారం రోజులుగా మల్లారెడ్డి దంపతులు డాన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారట!. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుక కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మల్లారెడ్డి గర్వంగా చెబుతున్నారు. 50 ఏళ్ల తమ బంధంలో ఎలాంటి పొరపొచ్చాలు లేవని.. అందుకే ఇంత గ్రాండ్‌గా చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల వీఐపీలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. మొత్తానికి, అసెంబ్లీలోనైనా, బయటైనా తనదైన మార్క్ చూపే మల్లన్న.. ఇప్పుడు ఈ వయసులో మళ్లీ పెళ్లికొడుకుగా ముస్తాబవుతూ మరోసారి తన జోష్ చూపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ !

గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌

ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ

Follow Us