అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
తైవానీస్ పాప్ స్టార్ జోలిన్ సాయ్ తన ‘ప్లెజర్ వరల్డ్ టూర్’తో సోషల్ మీడియాను ఊపేసింది. 30 మీటర్ల అనకొండ ఆకారపు స్టేజ్‌పై ఆమె చేసిన డేరింగ్ డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. తైపీలో జరిగిన ఈ మూడు రోజుల షోకు లక్షల మంది అభిమానులు హాజరయ్యారు. ఆమె ప్రదర్శనను ధైర్యమైన, సినిమాటిక్ అంటూ ప్రశంసించారు. ఆసియా పాప్ కచేరీలకు కొత్త బెంచ్‌మార్క్ అని అభివర్ణించారు.
తైవానీస్ పాప్ స్టార్ జోలిన్ సాయ్ తన లేటెస్ట్ వరల్డ్ టూర్ షోతో సోషల్ మీడియాను ఊపేసింది. 30 మీటర్ల పొడవైన అనకొండ తలపై నిలబడి ప్రమాదకరమైన ప్రదర్శన ఇచ్చింది. ఆమె డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆమె తన ప్లెజర్ వరల్డ్ టూర్ సందర్భంగా ఈ డ్యాన్స్ చేసింది. ఇది డిసెంబర్ 30 నుండి జనవరి 1 వరకు తైపీలో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవం ప్రతి రాత్రి సుమారు 40 వేల మంది ప్రేక్షకులను ఆకర్షించింది. మొత్తం లక్షా 20 వేల మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చారని తెలిసింది. తైవానీస్ పాప్ సింగర్ జోలిన్ సాయ్ ఆసియాలో అత్యంత సాహసోపేతమైన ప్రత్యక్ష ప్రదర్శనకారులలో ఒకరిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు, ఆమె అనకొండ ఆకారంలో ఉన్న వేదికపై ప్రమాదకరమైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. వైరల్ వీడియోలో ఆమె పెద్ద, కదిలే పాము ఆకారంలో ఉన్న స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తోంది. అవును అది నిజమైన పాము కాదు. స్టేజ్ సెటప్. 30 మీటర్ల పొడవైన పాము ఆకారంలో ఉన్న స్టేజ్‌పై నిలబడి ఆమె పాటలు పాడుతూ, డ్యాన్స్ చేసింది. ఈ అద్భుతమైన దృశ్యం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఈ పామును ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడానికి సిబ్బంది సహాయం చేశారు. ప్రేక్షకులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. చాలామంది ఈ ప్రదర్శనను సినిమాటిక్, ధైర్యం, ఆసియా పాప్ కచేరీలలో కొత్త బెంచ్‌మార్క్ అంటూ ప్రశంసించారు. కదులుతున్న పాముపై ఆమె పూర్తి కాన్ఫిడెన్స్‌తో డ్యాన్స్ చేయడం నిజంగానే ప్రేక్షకులకు సినిమా స్టంట్‌ని మించి కనిపించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
Whatsapp: బీ అలర్ట్.. భయపెడుతున్న వాట్సాప్ హ్యాక్ స్కామ్
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. ఆ దేశం అయితే వణికిపోయేదాన్ని
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

