అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
జపాన్‌లోని టోయోసు మార్కెట్‌లో 243 కేజీల బ్లూఫిన్ ట్యూనా చేప $3.24 మిలియన్ డాలర్లకు (రూ. 26.72 కోట్లు) రికార్డు ధరకు అమ్ముడైంది. కియోమురా కార్పొరేషన్, సుశి జాన్‌మై యజమాని కియోషి కిమురా ఈ భారీ చేపను సొంతం చేసుకున్నారు. గతంలో 2019లోనూ ఇదే సంస్థ రికార్డు సృష్టించింది. అత్యంత ఖరీదైన ఈ చేప జపాన్ సుశి మార్కెట్‌లో దాని విలువను చాటింది.
సాధారణంగా చేపలు ఎంత ఖరీదుంటాయి. రూ.100 నుంచి ఎక్కువలో ఎక్కువ లక్ష రూపాయల వరకూ పలకవచ్చు. కానీ జపాన్లో ఓ చేప ఏకంగా 3.24 మిలియన్ డాలర్ల ధర పలికింది. 243 కిలోల బరువున్న ఆ చేపను కియోమురా కార్పొరేషన్ సంస్థ వేలంలో దక్కించుకుంది. జపాన్ రాజధాని టోక్యోలోని టోయోసు మార్కెట్‌లో భారీ బ్లూఫిన్ ట్యూనా చేప రికార్డు ధర పలికింది. 243 కిలోల బరువున్న ఆ చేపను వేలంలో 3.24 మిలియన్ డాలర్లు అంటే రూ.26.72 కోట్లకు కియోమురా కార్పొరేషన్ సొంతం చేసుకుంది. సోమవారం టోయోసు మార్కెట్‌కు వచ్చిన ఈ చేపను వేలం వేయగా దానిని దక్కించుకునేందుకు పలువురు పోటీపడ్డారు. కాగా కియోమురా సంస్థ అధ్యక్షుడు కియోషి కిమురా సొంతం చేసుకున్నారు. కిమురా..సుషి జాన్‌మై పేరిట గొలుసుకట్టు సుషి రెస్టారెంట్‌లను నిర్వహిస్తున్నారు. 2019లో లో కూడా ఇదే కంపెనీ బ్లూఫిన్ ట్యూనా చేపను ఏకంగా 3.1మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు మళ్లీ అదే కంపెనీ ఈ చేపను భారీధరకు కొనుగోలు చేసి ఆ రికార్డును తానే బద్దలు కొట్టింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే
సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ… కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు! వీడియో వైరల్
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
ముందుకు కదలకుండా ఆగిన అతిపెద్ద శివలింగం
ఇరవైల్లోనే రూ. 9 కోట్ల ఇంటిని సొంతం చేసుకుంది
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా

