జేఎఫ్-17 యుద్ధ విమానాలపై.. దోస్త్ మేరా దోస్త్
ఒకప్పుడు బద్ద శత్రువులైన బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇప్పుడు ఆప్తమిత్రులవుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత, బంగ్లాదేశ్ పాక్‌తో సంబంధాలను బలపరుస్తోంది. తాజాగా పాక్ నుంచి జేఎఫ్-17 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు బంగ్లా ఆసక్తి చూపిస్తోంది. భారత్‌పై ద్వేషంతో ఈ కొత్త దోస్తీ ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపనున్నాయి.
ఒకప్పటి బద్ద శత్రువులు ఇప్పుడు ఆప్తమిత్రులుగా మారిపోతున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. భారత్‌పై విద్వేషంతో బంగ్లాదేశ్ పాకిస్తాన్ పంచన చేరుతోంది. పాత చేదు జ్ఞాపకాలను పక్కనపెట్టి నువ్వే మా పంచ ప్రాణం అంటూ పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ దోస్తాన్ చేస్తోంది. బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత పాకిస్థాన్‌తో దోస్తీ కట్టేందుకు ఉత్సాహం చూపిస్తోంది. అనేక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు పాక్, బంగ్లా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. తాజాగా పాక్ నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు బంగ్లా సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. చైనా, పాకిస్థాన్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన జేఎఫ్-17 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ఆసక్తిగా ఉందని పాక్ సైనిక వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ హసన్ మొహ్మద్ ఖాన్, పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ జహీర్ ఆహ్మద్ బాబర్ సిద్ధూలు ఇస్లామాబాద్‌లో ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జేఎఫ్-17 యుద్ధ విమానాల కోసం విస్తృత స్థాయి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అత్యాధునిక యుద్ధ విమానాల పనితీరుతోపాటు ప్రాథమిక స్థాయి నుంచి అధునాతన సాంకేతికతపై వివిధ సైనిక కేంద్రాల్లో సమగ్ర శిక్షణ అందిస్తామని పాకిస్థాన్ బంగ్లాకు హామీ ఇచ్చిదట. పాకిస్థాన్ నుంచి 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది. అయితే, నాటి యుద్ధంలో పాక్ దళాలకు సాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించి షేక్ హసీనా ప్రభుత్వం 2010లో విచారణ చేపట్టింది. దీంతో ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. గతేడాది యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఆ రెండు దేశాల సంబంధాలు మళ్లీ చిగురించాయి. అయితే ప్రగల్భాలు పలకడం, నవ్వులపాలవడం పాకిస్థాన్‌కు కొత్తేంకాదు. భారత్‌తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిందని, అవి హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయని పాక్ పగటి కలలు కంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెద్ద మొత్తంలో బంగారం.. స్విట్జర్లాండ్‌కు తరలించిన మదురో
డోపింగ్ టెస్టులో పట్టుబడ్డ క్రికెటర్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

