నౌక పెట్టిన అగ్గి మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ??
అమెరికా-వెనిజులా సంఘర్షణలు, రష్యా-చైనా ఆగ్రహం, రష్యా జెండా నౌకను అమెరికా సీజ్ చేయడంతో మూడో ప్రపంచ యుద్ధ భయాలు పెరుగుతున్నాయి. లాటిన్ అమెరికాలో మొదలైన ఈ చిచ్చు ప్రపంచ శాంతికి సవాలుగా మారింది. అమెరికా దుందుడుకు చర్యలు యుద్ధానికి దారితీస్తాయని రష్యా హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయి.
మూడో ప్రపంచం యుద్ధం రాబోతుందా? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశాలపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాడులు ఒకవైపు రష్యా, చైనాను కంట్రోల్ చేసేందుకు ట్రంప్ దూకుడు మరోవైపు మధ్యలో బ్రిటన్.. ట్రంప్‌కు తందనా అనడం.. తాజాగా రష్యా జెండా ఉన్న షిప్‌ను అమెరికా సీజ్ చేయడం.. దాడులకు సిద్ధంగా ఉండాలని రష్యా వార్నింగ్ వంటి పరిణామాలు.. టోటల్ ప్రపంచం ఇప్పుడు థర్డ్ వరల్డ్‌వార్ ముంగిట నిల్చుని ఉందనే సంకేతాలు ఇస్తున్నాయి. కొత్త ఏడాది జనవరి 3న వెనిజులా రాజధాని కరాకస్‌పై అమెరికా జరిపిన ఆకస్మిక వైమానిక దాడులతో రష్యా, చైనాకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. లాటిన్ అమెరికాలో మొదలైన ఈ చిచ్చు ప్రపంచ శాంతికి సవాలుగా మారింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా జైలులో బంధించాడు ట్రంప్. అమెరికా నిప్పుతో చెలగాటం ఆడుతోందని చైనా హెచ్చరించింది. వెనిజులా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తే రష్యా మౌనంగా ఉండదని, తమ మిత్రదేశాన్ని ఒంటరిని చేయబోమని మాస్కో స్పష్టం చేసింది. తాజాగా రష్యా జెండాతో ఉన్న వెనెజువెలా చమురు నౌకను అమెరికా సీజ్ చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై ఇప్పటికే పుతిన్ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అమెరికాకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే అమెరికా పడవలను ముంచేస్తామని హెచ్చరించింది. ‘‘ఏం చేసినా మాకు శిక్ష పడదు అన్న అతివిశ్వాసంతో అమెరికా ప్రవర్తిస్తోంది. ప్రతీకార చర్యలను అమెరికా మానుకోవాలి. అంతర్జాతీయ చట్టాలను ఇలాగే ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులను ఎదుర్కోడానికి ఆ దేశం సిద్ధంగా ఉండాలి. అవసరమైతే టార్పిడోలతో దాడులు చేయడం, అమెరికా కోస్ట్ గార్డ్ పడవలను ముంచేయడం వంటివి చేయాల్సి వస్తుంది’’ అని రష్యా చట్టసభ్యుడు అలెక్సీ జురావ్లెవ్ హెచ్చరించారు. ఈ నౌక స్వాధీనానికి సంబంధించిన వీడియోను యూఎస్ కోస్ట్‌గార్డ్ విడుదల చేసింది. అమెరికా రక్షణశాఖ, తీర రక్షక దళం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రష్యా నౌక మ్యారినెరా పాత పేరు బెల్లా-1ను సీజ్ చేసినట్లు అందులో పేర్కొంది. అమెరికా భద్రత, అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాసుకొచ్చింది. ఐస్‌లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో ఈ నౌకను స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్ నుంచి అమెరికా మెరీన్లు నౌక పైకి దిగి.. అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు బ్రిటన్ కూడా సహకరించింది. అమెరికా ఈ దాడి చేసే సమయానికి రష్యా దళం అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను కూడా అమెరికా దళాలు సీజ్ చేశాయి. మొత్తానికి రష్యా జెండాతో వెళ్తున్న చమురు నౌకను బ్రిటన్ సహకారంతో అమెరికా స్వాధీనం చేసుకోవడం పెను దుమారాన్ని రేపుతోంది. వెనెజువెలా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చేసుకోవడం అమెరికా-రష్యాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెనిజులా అధ్యక్షుడు, అతడి భార్యను ఎలా బంధించారంటే ?? ఏఐ వీడియో
జేఎఫ్-17 యుద్ధ విమానాలపై.. దోస్త్ మేరా దోస్త్
పెద్ద మొత్తంలో బంగారం.. స్విట్జర్లాండ్‌కు తరలించిన మదురో
డోపింగ్ టెస్టులో పట్టుబడ్డ క్రికెటర్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

