పూరి-తిరుపతి రైలులో అగ్నిప్రమాదం
పూరి-తిరుపతి రైలు B5 బోగీలో తుని-అన్నవరం మధ్య అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ఉదయం 6 గంటలకు మంటలు చెలరేగగా, సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా దించారు. ప్రాణనష్టం లేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రాజమండ్రి వద్ద క్లూస్ టీమ్ తనిఖీలు చేసింది. ప్రమాద కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
పూరి – తిరుపతి రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం 6 గంటల సమయంలో తుని నుంచి అన్నవరం మధ్య రైలు ప్రయాణిస్తుండగా B5 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోగీలో పొగలు రావడం గమనించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలు వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. ప్రయాణికులను సురక్షితంగా బోగీలనుంచి కిందకు దించారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. బోగీలోని విద్యుత్ ప్యానల్ బోర్డు వద్ద దుప్పట్లకు మంటలు అంటుకున్నాయి. కాలిపోయిన దుప్పట్లను తొలగించారు. అనంతరం రాజమహేంద్రవరం స్టేషన్‌లో రైలును నిలిపి బోగీని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. ప్యానల్ బోర్డు వద్ద ప్రమాదం జరిగిందా? లేక ప్రయాణికులు ఎవరైనా సిగరెట్లు కాల్చారా? అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు వచ్చిన బోగీని పరిశీలించింది. ఈ ఘటనతో కొంతసేపు రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటా 40 నిమిషాల పాటు రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో రైలును అధికారులు నిలిపివేశారు. విస్తృత తనిఖీల అనంతరం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి రైలు బయలుదేరి వెళ్లింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

