సంక్రాంతికి లగ్జరీ కారవాన్‌లో జాలీ ట్రిప్.. ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీ రెడీ
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్న పర్యాటకుల కోసం ఏపీ టూరిజం శాఖ కారవాన్ టూరిజంను ప్రారంభించింది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక ప్యాకేజీలతో కారవాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో వసతి, టీవీ, ఫ్రిజ్, వాష్‌రూం వంటి సౌకర్యాలుంటాయి. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. గోవా వంటి రాష్ట్రాల విజయవంతమైన మోడల్‌ను ఏపీ అందిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి షురూ అయింది. ముఖ్యంగా ఏపీలో పది రోజుల ముందు నుంచే సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అనేక మంది కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో టూర్‌కూ ప్లాన్ చేసుకుంటున్నారు. వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ టూరిజం శాఖ టూరిస్టులకు కొత్త అనుభూతి కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. పండగ సెలవుల్లో టూరిస్ట్ స్పాట్‌లకు వెళ్లే పర్యాటకులకు ఆ శాఖ అధికారులు కారవాన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాజకీయ, సినీ, బిజినెస్ సెలబ్రెటీలు మాత్రమే వాడే స్థాయి కారవాన్లలో ఉండే సౌకర్యాలను అందుబాటు ధరల్లో పర్యాటకులకు అందించే క్రమంలో స్పెషల్ ప్యాకేజీలనూ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో పర్యాటకులు కారవాన్‌లో తిరుగుతూ పర్యాటక ప్రదేశాలను వీక్షించవచ్చు. తొలుత పైలెట్ ప్రాజెక్ట్ కింద 4 మార్గాల్లో 4 కారవాన్‌లను నడపనుంది. ఈ వాహనాల్లో 10 నుంచి 12 సీట్లు ఏర్పాటు చేశారు. సందర్శించాక పర్యాటకులు రాత్రుల్లో కార వాన్‌లోనే నిద్రపోయేలా వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. కూర్చొనే సీట్లనే మీరు నిద్రపోయే విధంగా మార్చుకోవచ్చు. వాహనంలో టీవీ, ఫ్రిజ్, వాష్‌రూం సదుపాయా లు ఉన్నాయి.కారవాన్ కావాలనుకునే వారు ఏపీటీడీసీ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి భీమవరం, దిండి వరకు కారవాన్ ప్యాకేజీని సంక్రాంతికి అందుబాటులోకి తీసుకురానుంది. 6 రోజుల ఈ ప్యాకేజ్ ధర రూ.3.50 లక్షలుగా ఉంది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీల్లో భోజన ఖర్చులు టూరిస్టులే భరించుకోవాల్సి ఉంటుంది. విశాఖపట్నం-అరకు, లంబసింగి మార్గాల్లో 10 నుంచి 12 సీట్ల కారవాన్ కోసం రూ.42,500, రూ.31,500 (5-6 సీట్లు),విశాఖ పట్నం నుంచి సింహాచలం, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్ షారామం మీదుగా వాడపల్లి మార్గంలో 10 నుంచి 12 మంది కూర్చునే కారవాన్ 36 గంటలకు రూ.42,500, ఐదారుగురు కూర్చొనే కారవాన్‌కు రూ.31,500, మూడో మార్గమైన హైదరాబాద్-గండికోట మార్గంలోని 10-12 సీట్లుండే కారవాన్‌కు రెండు రోజులకు రూ.85,000, అదే మార్గంలో ఐదారు సీట్లకు రూ.64,000 ప్యాకేజీ నిర్ణయించారు. ఇక నాలుగో మార్గంలో రెండు రోజుల పాటు హైదరాబాద్-సూర్యలంక టూర్ కు 10-12 సీట్ల కారవాన్ కోసం రూ.85,000, 5-6 సీట్లున్న కారవాన్‌కు రూ.64,000గా ఖరారు చేసారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కారవాన్ టూరిజంను ప్రవేశపెట్టారు. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో కారవాన్ల వ్యవస్థ ఉంది. వీటికి పర్యాటకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కారవాన్ల టూరిజం ఆ రాష్ట్రంలో సక్సెస్ అవ్వడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కారవాన్ల కోసం ఇండియా లక్సీ, ఎల్‌ఎల్‌పీ, ఓటీ డ్రీమ్ లైనర్స్ సంస్థలతో ఏపీ పర్యటకాభివృద్ది శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థలు కారవాన్లను అందించనున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోబోలకు నొప్పి తెలుస్తుంది.. సైంటిస్టుల ప్రయోగం సక్సెస్
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 37శాతం డేంజర్ జోన్‌లోనే
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..! విద్యార్థులతో కలిసి టీచర్లు, ఐఏఎస్‌లు
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

