హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 37శాతం డేంజర్ జోన్‌లోనే
హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ వల్ల వరద ముప్పు పెరుగుతోందని TISS అధ్యయనం వెల్లడించింది. మూడింట ఒక వంతు నగరం అధిక వరద ముప్పు ఎదుర్కొంటోంది. కాంక్రీట్ విస్తరణ, నాలాల్లో పూడిక, చెరువుల కుంచించుకుపోవడం, వ్యవస్థాగత లోపాలు ప్రధాన కారణాలు. సరైన ప్రణాళిక లేకపోతే భవిష్యత్తులో నగరానికి తీవ్ర ప్రమాదం.
భాగ్యనగరం వేగంగా విస్తరిస్తోంది..కానీ అదే వేగంతో వరద ముప్పు కూడా పొంచి ఉంది. గత రెండు దశాబ్దాలుగా జరిగిన విచ్చలవిడి పట్టణీకరణ వల్ల గ్రేటర్ హైదరాబాద్‌లోని దాదాపు మూడింట ఒక వంతు ప్రాంతం అధిక వరద ముప్పు ఎదుర్కొంటోందని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తాజా అధ్యయనంలో తేలింది. 2000 సంవత్సరం నుండి గ్రేటర్ హైదరాబాద్ పరిధి 45శాతం మేర పెరిగింది. ఈ క్రమంలో నగర విస్తీర్ణం 293 చదరపు కీలోమీటర్ల నుండి 425 చదరపు కీలోమీటర్లలకు పెరిగింది. నగర భూభాగంలో 11శాతం ప్రాంతం అత్యధిక ముప్పు కింద ఉండగా, మరో 26శాతం ప్రాంతం అత్యంత దుర్బలమైనదిగా గుర్తించారు. నేలంతా కాంక్రీట్ మయం కావడంతో వర్షపు నీరు భూమిలోకి వెళ్లే దారి లేక, రోడ్లపైనే ప్రవాహంగా మారుతోంది. అయితే, హైదరాబాద్‌లో వరదలకు కేవలం వర్షం మాత్రమే కారణం కాదు.. వ్యవస్థాగత లోపాలు కూడా ప్రధాన కారణమని పరిశోధకులు తేల్చారు. నాలాల్లో పూడిక పేరుకుపోవడం వల్ల నీరు ప్రవహించే సామర్థ్యం తగ్గింది. ప్లాస్టిక్, ఘన వ్యర్థాలను కాలువల్లో వేయడం వల్ల తుఫాను నీటి నెట్‌వర్క్ దాదాపుగా స్తంభించిపోయింది. చెరువులు కుంచించుకుపోవడం, కాలువల అనుసంధానం లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. హైదరాబాద్ నగరానికి తలమానికమైన మూసీ నది ఉప్పొంగడం వల్ల 1908లో భారీ వరదలు సంభవించాయి. ఆ తర్వాత ఇటీవలే 2025లో మూసీ నది ఉధృతంగా ప్రవహించి ఎన్నో ప్రాంతాలను నీట ముంచింది. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రాంతాలకు ప్రయాణ వారధిగా ఉన్న ఎంజీబీఎస్ కూడా భారీ వరదతో నీట మునగడం మనకు తెలిసిందే. తద్వారా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడి ఆర్టీసీ బస్సులను సైతం దారి మళ్లించారు. ఇదిలా ఉండగా 2020 అక్టోబర్‌లో భారీ వర్షాలకు ఘట్‌కేసర్ వంటి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసి నగరాన్ని వరదలు ముంచెత్తాయి. తుఫాను నీటి వ్యవస్థలను పునరుద్ధరించకపోతే భవిష్యత్తులో అస్థిర వర్షపాతం వల్ల నగరం అతలాకుతలం అవుతుందని పట్టణ ప్రణాళికదారులు హెచ్చరిస్తున్నారు. నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా సరైన వాలు ఉండేలా రోడ్ల నిర్మాణం జరగాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..! విద్యార్థులతో కలిసి టీచర్లు, ఐఏఎస్‌లు
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

