AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

Phani CH
|

Updated on: Jan 09, 2026 | 9:00 PM

Share

పూణేలో 51 ఏళ్ల క్రితం జరిగిన ఓ చిన్న చోరీ కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 1974లో రూ.60 విలువైన వస్తువుల దొంగతనం కేసులో రాజారాం తుకారాం కాలే నిర్దోషిగా విడుదలయ్యారు. సుదీర్ఘ విచారణ అనంతరం సాక్ష్యాధారాల లేమితో డిసెంబర్ 26, 2025న ఈ తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. కోర్టుల జాప్యానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది.

సాధారణంగా కోర్టు కేసులంటే సంవత్సరాలు తరబడి కోర్టు చుట్టూ తిరగాలని చాలామందికి తెలుసు. తీర్పు వచ్చేసరికి ఉన్న ఆస్తులన్నీ కరిగిపోతాని భయపడి చాలామంది ఈ కేసుల జోలికి వెళ్లరు. ఇందుకు మరో ఉదాహరణే ఈ ఘటన. చిన్న చోరీ కేసు విషయమై 51 ఏళ్లతర్వాత తీర్పు వెలువడింది. అది 1974వ సంవత్సరం. అప్పుడు ఒక డాలర్ మారకపు విలువ రూ.8 గా ఉండేది. పూణె బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 14న.. ఓ వ్యక్తి నుంచి రూ. 60 విలువ చేసే చేతి గడియారం, రూ. 4, ఒక హ్యాండ్ కర్ఛీఫ్ దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో సదరు వ్యక్తి బండ్ గార్డెన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నయోదు చేశారు. అందులో రాజారాం తుకారాం కాలే అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని నిందితులుగా పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా రాజారాం కాకుండా.. మిగతా ఇద్దరు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో వారికి కోర్టు.. 1975 ఏప్రిల్‌లో మూడు నెలల జైలు శిక్ష విధించింది. కాగా రాజారాం మాత్రం తన తప్పును ఒప్పుకోలేదు. పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత.. రాజారాం పారిపోయాడు. దీంతో కోర్టులో కేసు విచారణ ఆగిపోయింది. కోర్టు రికార్డుల ప్రకారం.. రాజారాంకు ఎప్పటికప్పుడు నాన్-బెయిలబుల్ వారంట్లు, ప్రొక్లెయిమేషన్ ప్రోసీడింగ్స్ జారీ చేశారు. కానీ అతడు ఎక్కడున్నాడో మాత్రం కనిపెట్టలేకపోయారు పోలీసులు. ఇప్పటికీ రాజారాం ఎక్కడున్నాడో తెలియదు. ఈ నేపథ్యంలో పూణెలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ కోర్టు జడ్జిగా ఎన్‌జే చవాన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించారు. దీంతో ఈ కేసు బయటపడింది. దీనిపై కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభమైంది. విచారణ తర్వాత రాజారాం తురాకారం కాలేను నిర్దోషిగా తేల్చారు రైల్వే కోర్టులోని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్ జె చవాన్. 2025 డిసెంబర్ 26న ఈ కేసులో తుది తీర్పు ఇచ్చారు. “నిందితుడికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఇప్పటివరకు ఎలాంటి సాక్షులను ప్రవేశపెట్టలేకపోయింది. నిందితుడిపై ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. దోషిగా నిర్ధారించబడటానికి తగినన్ని ఆధారాలు లేకపోతే.. ఈ కేసును నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడం సరైంది కాదు. అందుకే కోర్టు, పోలీసు యంత్రాంగం, ప్రాసిక్యూషన్ సమయం వృథా కాకుండా.. తగిన ఉత్తర్వులు జారీ చేయడం మంచిది. అందుకే అతడిపై జారీ అయిన వారెంట్లన్నీ రద్దు చేస్తూ నిర్దోషిగా ప్రకటిస్తున్నాము” అని జడ్జి వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

33 రోజుల్లో రికార్డ్స్ అవుట్.. అన్నీ అతడి హస్తగతం

Samantha: పెద్ద ప్లాన్ చేస్తున్న సమంత.. వర్కవుట్ అయితే రచ్చే

Kalki 2: కల్కి 2పై ఖతర్నాక్ కబురు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే

సంక్రాంతి సినిమాల బిజినెస్ రూ.850 కోట్లు.. అంత స్టామినా ఉందా

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ విడుదల.. మార్పు మంచికే