సంక్రాంతి సినిమాల బిజినెస్ రూ.850 కోట్లు.. అంత స్టామినా ఉందా
ఈ సంక్రాంతికి తెలుగు సినిమా బాక్సాఫీస్ భారీ వ్యాపారానికి సిద్ధమైంది. ప్రభాస్ 'రాజాసాబ్', చిరంజీవిల చిత్రాలతో కలిపి మొత్తం ₹850 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతోంది. ప్యాన్ ఇండియా చిత్రాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు ఈ పండుగకు విడుదలవుతుండటంతో, బయ్యర్లు, నిర్మాతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. పెట్టుబడులు తిరిగి రావాలంటే వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు రేట్ల గురించి చూసాం కదా.. అసలు ఈసారి సంక్రాంతి బిజినెస్ ఎంత ఉంది.. ఎన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది..? నిజంగా మన సినిమాలకు ఇంత మార్కెట్ ఉందా అనేది ఈ స్టోరీలో చూద్దాం. ఒక్క పండక్కి ఇన్ని వందల కోట్ల బిజినెస్ జరుగుతుందా అనే ఆశ్చర్యం తప్పదు మీరు ఈ బిజినెస్ చూసాక. మరి ఈ బిజినెస్‌పైనా ఓ లుక్ వేద్దాం పదండి.. ఈసారి సంక్రాంతి రేసు మామూలుగా లేదు, బాక్సాఫీస్ బరిలో దిగుతున్న సినిమాల బిజినెస్ చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. టాలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా.. బడ్జెట్, ప్రీ-రిలీజ్ లెక్కలు కలిపి పండక్కి 850 కోట్ల మేర బిజినెస్ జరుగుతుంది. మామూలుగా సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు వస్తుంటాయి.. కానీ ఈసారి ప్యాన్ ఇండియా కూడా ఉన్నాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సీజన్‌పై కోట్ల ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ది రాజాసాబ్ ఈ మొత్తం బిజినెస్‌లో సింహభాగం తీసుకుంటుంది. మారుతి తెరకెక్కించిన ఈ సినిమాకు 500 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ప్రభాస్ మార్కెట్, విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చు చూస్తే ఈ మాత్రం అవుతుంది. ఇక మన శంకరవరప్రసాద్ గారు వాటా 200 కోట్ల వరకు ఉంది. ప్రభాస్, చిరంజీవి సినిమాలే 700 కోట్ల బడ్జెట్ మార్కును తాకుతుండటం విశేషం. వీటితో పాటు మిగిలిన 3 సినిమాల బడ్జెట్‌లు.. బిజినెస్ కలుపుకుంటే మరో రూ.100 కోట్ల వరకు ఉంటుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి కనీసం 40 కోట్ల వరకు వాటా తీసుకుంటుంటే.. అనగనగా ఒకరాజు, నారినారి నడుము మురారి కలిపి 60 కోట్లు వ్యాల్యూ చేస్తున్నాయి. జరిగిన 850 కోట్ల బిజినెస్ తిరిగి రావాలంటే.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు బీభత్సంగా ఉండాలి. షేర్ 850 కోట్లు రావాలంటే.. గ్రాస్ 1500 కోట్లు రావాలి. అప్పుడే బయ్యర్లు, నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్తారు. ఏ మాత్రం తేడా వచ్చినా భారీ నష్టాలు తప్పవు. మరి ఈ సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్ తన స్టామినాను ఎలా నిరూపించుకుంటుందో వేచి చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ విడుదల.. మార్పు మంచికే
చిరంజీవికి సర్జరీ.. అందుకే బయటికి రావడం లేదా ?? మెగా డాటర్ క్లారిటీ
iBomma Ravi: ఐబొమ్మ రవికి బొమ్మ చూపించిన నాంపల్లి కోర్ట్
టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల కోసం ఉచిత స్నాక్స్
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

