iBomma Ravi: ఐబొమ్మ రవికి బొమ్మ చూపించిన నాంపల్లి కోర్ట్
పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఐదు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. విదేశీ పౌరసత్వం ఉన్నందున రవి దేశం దాటే ప్రమాదం ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు. దర్యాప్తులో రవి నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి, స్నేహితుల వివరాలతో బ్యాంక్ అకౌంట్లు తెరిచినట్లు తేలింది.
పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అలియాస్ ఇమంది రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అతడికి సంబంధించిన 5 బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని, పైగా అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉన్నందున బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే ప్రమాదం ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇమంది రవి విచారణలో పలు కీలక విషయాలు బయటికొచ్చాయి. ఇప్పటికే తన స్నేహితుడు ప్రహ్లాద్ తోపాటు మరో ఇద్దరి పేర్లతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్థారించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్ తోపాటు అంజయ్య, కాళీ ప్రసాద్ పేర్లు, వివరాలు ఉపయోగించి నకిలీ కార్డులు సంపాదించాడని పోలీసులు విచారణలో నిర్ధారించారు. వీటిని ఉపయోగించి తన ఫోటోతో కొన్ని గుర్తింపు కార్డులతో దరఖాస్తు చేసి తీసుకోగా.. మరికొన్ని తయారు చేశారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి రవితో కలిసి 2017లో అమీర్ పేట్ లోని హాస్టల్ రూమ్ లో ఉన్నాడు. ఆ సమయంలో అతడికి సంబంధించిన పదవ తరగతి మార్కుల లిస్ట్, ఆధార్ కార్డుల కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని ఉపయోగించి అతడి పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నాడు. వీటితోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. తన పదవ తరగతి క్లాస్ మేట్స్ పేర్ల ఆధారంగానూ రవి అనేక నకిలీ గుర్తింపు కార్డులు రూపొందించాడని కూడా పోలీసులు కోర్టుకు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల కోసం ఉచిత స్నాక్స్
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
పూరి-తిరుపతి రైలులో అగ్నిప్రమాదం
దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

