టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల కోసం ఉచిత స్నాక్స్
తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు తీపికబురు అందించింది. SSC వార్షిక పరీక్షల ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం అందించేందుకు రూ. 4.23 కోట్లు మంజూరు చేసింది. ఫిబ్రవరి 16 నుండి మార్చి 10 వరకు 19 రోజుల పాటు స్నాక్స్ పంపిణీ చేయనున్నారు. పరీక్షల ఒత్తిడిని తగ్గించి, పౌష్టికాహారం అందించడమే ఈ నిర్ణయం లక్ష్యం.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలో జరగనున్న SSC వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం అందించేందుకు నిధులను మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల కోసం మొత్తం రూ. 4,23,11,385 నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు విడుదల చేయాలని స్టేట్ ఫైనాన్స్ కంట్రోలర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. పదో తరగతి పరీక్షల దృష్ట్యా నిర్వహించే ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ పంపిణీ చేయనున్నారు. మొత్తం 19 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 16 నుండి మార్చి 10 వరకు స్నాక్స్ అందించనున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు, సాయంత్రం వేళ అదనపు గంటలు చదువుకునే వారికి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లెర్నింగ్ ఎన్‌హాన్స్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ నిధులను పంపిణీ చేయనున్నారు. ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సాయంత్రం పూట స్నాక్స్ అందించడం వల్ల విద్యార్థులు ఉత్సాహంగా చదువుపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
పూరి-తిరుపతి రైలులో అగ్నిప్రమాదం
దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..

