భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ విడుదల.. మార్పు మంచికే
వరుస ఫ్లాపులతో సతమతమైన మాస్ రాజా రవితేజ, 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రంతో సరికొత్త ప్రయాణం మొదలుపెట్టారు. మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి, ఈసారి పూర్తిగా కుటుంబ ప్రేక్షకులను అలరించే కథను ఎంచుకున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ సందడిగా ఉంది, సంక్రాంతి వైబ్స్‌ను అందిస్తోంది. రవితేజ ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.
వచ్చిన సినిమా వచ్చినట్లు పోతుంటే.. ఈసారి వచ్చే సినిమా నిలబడేలా ఉండాలి కానీ ఇలా వచ్చి అలా పోయేలా ఉండకూడదని.. లెక్కలేసుకుని మరీ రవితేజ చేసిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా కోసం 360 డిగ్రీస్‌లో మారిపోయారు మాస్ రాజా. ఈ మార్పు కూడా గట్టిగానే కనిపిస్తుంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది..? భర్త మహాశయులకు మాయ చేస్తుందా..? ఇన్నాళ్లూ మాస్ రాజాగా కనిపించిన రవితేజ.. సడన్‌గా ఫ్యామిలీ మ్యాన్ అయిపోయారు. అందుకే టైటిల్‌లో కూడా మాస్ రాజా అని లేకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చారు రవితేజ. కొన్నేళ్లుగా వరస ఫ్లాపులతో ఇబ్బంది పడిన రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తితో పూర్తిగా క్లాస్ రూట్‌లోకి వచ్చేసారు. అడిగి మరీ ఓ ఫ్యామిలీ సినిమా చేసారు మాస్ రాజా. గ్యాప్ తీసుకుని చేసినా.. గ్యాప్ లేకుండా వరసగా నటించినా ఫలితాలు మాత్రం మారట్లేదు. అందుకే ఈసారి మాస్ జోనర్ కాకుండా.. డిఫెరెంట్‌గా ప్రయత్నిస్తున్నారు రవితేజ. భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ అంతా చాలా సందడిగా ఉంది. ఓవైపు డింపుల్ హయాతీ.. మరోవైపు ఆషికా గ్లామర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సంక్రాంతి వైబ్స్ అన్నీ ట్రైలర్‌లోనే కనిపిస్తున్నాయి. సారొచ్చారు తర్వాత రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తిపై అంచనాలు బానే ఉన్నాయి. ఇదే కాదు.. నెక్ట్స్ శివ నిర్వాణ దర్శకత్వంలో తండ్రీ కూతురు బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ చేస్తున్నారు రవితేజ. మొత్తానికి ఈ డిఫెరెంట్ ప్రయత్నాలు రవితేజకు ఎలాంటి ఫలితాన్నిస్తాయనేది చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరంజీవికి సర్జరీ.. అందుకే బయటికి రావడం లేదా ?? మెగా డాటర్ క్లారిటీ
iBomma Ravi: ఐబొమ్మ రవికి బొమ్మ చూపించిన నాంపల్లి కోర్ట్
టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల కోసం ఉచిత స్నాక్స్
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

