Kalki 2: కల్కి 2పై ఖతర్నాక్ కబురు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి 2 సినిమా షూటింగ్ తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 4, 2026 నుండి కల్కి 2 చిత్రీకరణ ప్రారంభం కానుంది. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాతో పాటే రెబల్ స్టార్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనున్నారు. ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా ఏర్పడిన సందిగ్ధతకు తెరపడగా, కల్కి 2 వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
కల్కి 2 సినిమా ఎప్పుడు..? షూటింగ్ మొదతలయ్యేదెప్పుడు..? వరస సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండటంతో.. కల్కి 2పై కన్ఫ్యూజన్స్ తప్ప క్లారిటీ లేకుండా పోయింది. పైగా నాగ్ అశ్విన్ సైతం కల్కి సీక్వెల్ గురించి ఎప్పుడు అడిగినా నవ్వేసి ఊరుకుంటున్నారు. అసలింతకీ ఈ సినిమా షురూ అయ్యేదెప్పుడు.. ఆ డీటైల్స్ అన్నీ చూద్దామా..? చూస్తుండగానే కల్కి విడుదలై ఏడాదిన్నర దాటిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ రాజా సాబ్ సినిమా పూర్తి చేసారు.. ఫౌజీ షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది.. ప్రస్తుతం స్పిరిట్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. మరోవైపు వైజయంతి మూవీస్ కూడా కల్కి తర్వాత ఛాంపియన్ సినిమాను పూర్తి చేసి విడుదల చేసారు. ప్రభాస్ వరస సినిమాలతో బిజీగా ఉండటంతో కల్కి 2పై అనుమానాలు అలాగే ఉండిపోయాయి. మొన్న ఛాంపియన్ టైమ్‌లో నిర్మాతలను అడిగినపుడు కూడా సమయం వచ్చినపుడు చెప్తామన్నారు. చూస్తుంటే ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లే కనిపిస్తుంది. 2026, ఫిబ్రవరి 4 నుంచి కల్కి 2 షూటింగ్ మొదలు కానుంది. సందీప్ వంగా స్పిరిట్‌తో పాటే దీన్ని పూర్తి చేయనున్నారు రెబల్ స్టార్. ఆల్రెడీ రాజా సాబ్ అయిపోయింది.. ఫౌజీ కూడా చివరిదశకు వచ్చేసింది. స్పిరిట్ మొన్నే మొదలైంది. ఒక్కసారి ఒకే సినిమా అని ఫిక్సైనా కూడా.. కమిట్‌మెంట్స్ ఎక్కువగా ఉండటంతో ప్రభాస్ డ్యూయల్ ప్రాజెక్ట్స్ చేయక తప్పట్లేదిప్పుడు. అందుకే కల్కి 2ను స్పిరిట్‌తో పాటే పూర్తి చేయాలని ఫిక్సైపోయారు ప్రభాస్. స్పిరిట్ షూటింగ్ 90 రోజుల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు సందీప్ వంగా. ఒకవేళ లేట్ అయినా కూడా 120 రోజులకు మించకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు ఫౌజీకి పెద్దగా టైమ్ అక్కర్లేదు. అందుకే కల్కి 2 ఫాస్ట్‌గా పూర్తయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రాజా సాబ్‌తో మరికొన్ని గంటల్లో రాబోతున్నారు ప్రభాస్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి సినిమాల బిజినెస్ రూ.850 కోట్లు.. అంత స్టామినా ఉందా
భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ విడుదల.. మార్పు మంచికే
చిరంజీవికి సర్జరీ.. అందుకే బయటికి రావడం లేదా ?? మెగా డాటర్ క్లారిటీ
iBomma Ravi: ఐబొమ్మ రవికి బొమ్మ చూపించిన నాంపల్లి కోర్ట్
టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల కోసం ఉచిత స్నాక్స్
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

