Samantha: పెద్ద ప్లాన్ చేస్తున్న సమంత.. వర్కవుట్ అయితే రచ్చే
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న "మా ఇంటి బంగారం" సినిమా టీజర్ జనవరి 9న విడుదల కానుంది. ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో సమంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించనున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో, సమంత నిర్మాణ భాగస్వామ్యంతో వస్తున్న ఈ చిత్రం, ఆమె కెరీర్‌లో ప్రత్యేకంగా నిలవనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఆ మధ్య సమంత మా ఇంటి బంగారం అంటూ ఓ సినిమా అనౌన్స్ చేసారు.. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ వెళ్లిపోయారు.. మధ్యలో బ్రేక్ ఇచ్చారు.. ఈ మధ్యే పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఆ బంగారం అప్‌డేట్ మాత్రం రాలేదు. ఇంతకీ ఆ సినిమా ముచ్చట్లేంటి..? మా ఇంటి బంగారం ఎప్పుడు రాబోతుంది..? షూటింగ్ అప్‌డేట్ ఏంటి..? ఖుషీ తర్వాత తెలుగులో కనబడలేదు సమంత. మధ్యలో శుభం సినిమాలో కాసేపలా కనిపించారంతే. ప్రస్తుతం ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న మా ఇంటి బంగారం అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ జనవరి 9న రిలీజ్ చేయబోతున్నారు. ఫ్యామిలీ లేడీగా నటిస్తూనే.. పవర్ ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో దర్శనమిస్తున్నారు స్యామ్. ఓ బేబి తర్వాత నందిని రెడ్డితో సమంత చేస్తున్న సినిమా మా ఇంటి బంగారం. ఈసారి డిఫరెంట్ ఎమోషన్స్, గ్రిప్పింగ్ స్టోరీ, బోల్డ్ నెస్‌తో ఈ సినిమా రాబోతుంది. సమంత నటిస్తుండటమే కాదు.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి నిర్మిస్తున్నారు కూడా. శుభం తర్వాత రెండో ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటే సమంత చాలా పవర్‌ఫుల్‌గా, ఎఫెక్టివ్‌గా కనిపిస్తున్నారని అర్థమవుతుంది. ఆమె పాత్రలోని ఇంటెన్సిటీ లుక్‌లో కనిపిస్తుంది. ఇందులో కాంతార ఫేమ్ గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. సమంత భర్త రాజ్ నిడిమోరు దీనికి రైటర్.. మొత్తానికి ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు స్యామ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kalki 2: కల్కి 2పై ఖతర్నాక్ కబురు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే
సంక్రాంతి సినిమాల బిజినెస్ రూ.850 కోట్లు.. అంత స్టామినా ఉందా
భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ విడుదల.. మార్పు మంచికే
చిరంజీవికి సర్జరీ.. అందుకే బయటికి రావడం లేదా ?? మెగా డాటర్ క్లారిటీ
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

