33 రోజుల్లో రికార్డ్స్ అవుట్.. అన్నీ అతడి హస్తగతం
పుష్ప 2 బాలీవుడ్‌లో 830 కోట్లతో సృష్టించిన రికార్డులను ఎవరూ బద్దలు కొట్టలేరనుకున్నారు. కానీ ఊహించని విధంగా వచ్చిన ధురంధర్ చిత్రం కేవలం 33 రోజుల్లోనే ఆ మార్క్‌ను చెరిపేసి 831 కోట్లు సాధించింది. బాలీవుడ్‌కు కొత్త బాక్సాఫీస్ చక్రవర్తిగా నిలిచి, భారతీయ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్‌గా అవతరించింది. రికార్డులు బద్దలవ్వడానికే అని నిరూపించింది.
రికార్డులున్నవే బద్ధలవ్వడానికి..! ఎంత హిస్టరీ క్రియేట్ చేసినా ఎవరో ఒకరు వచ్చి ఆ హిస్టరీని చెరిపేసి.. మళ్లీ కొత్త చరిత్ర రాస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌లోనూ అదే జరిగింది. బాక్సాఫీస్‌కు న్యూ ఎంపరర్ వచ్చాడు.. చాన్నాళ్లు ఉంటాయనుకున్న రికార్డుల్ని.. కనీవినీ ఎరుగని రీతిలో బద్ధలు కొట్టాడు ధురంధరుడు. మరి చెరిగిపోయిన రికార్డులేంటి.. చెరిపేసిందెవరో చూద్దామా..? పుష్ప 2 హిందీలో సాధించిన రికార్డులు చూసాక.. కొన్నేళ్ల పాటు వాటిని టచ్ చేయడానికి కూడా ఎవరికీ సాధ్యం కాదనుకున్నారంతా. ఎందుకంటే బాలీవుడ్‌లో తొలి 600, 700, 800 కోట్ల మార్క్ టచ్ చేసింది ఈ సినిమానే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నార్త్‌లో పుష్ప రాజ్ హవా ఎలా నడిచిందో చెప్పడానికి..! స్త్రీ 2, జవాన్, ఛావా లాంటి సినిమాలు దగ్గర్లోకి కూడా రాలేకపోయాయి. పుష్ప 2 సినిమాకు కేవలం హిందీలోనే 830 కోట్లు నెట్ వచ్చింది.. దాంతో 700 కోట్లు కూడా దాటని హిందీ సినిమాలకు 830 కోట్లు ఎవరెస్ట్ లాగే కనిపించింది. కానీ ఆ ఎవరెస్ట్‌ను ఎవరూ ఊహించని విధంగా ధురంధర్ ఎక్కేసింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. 33 రోజుల్లో పుష్ప 2 పేరు మీదున్న 830 కోట్ల రికార్డును తుడిచేసింది. కేవలం హిందీ వర్షన్‌లోనే విడుదలైన ధురంధర్.. ఇండియాలోనే 831 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ న్యూ ఎంపరర్‌గా నిలవడమే కాదు.. బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇండియన్ సినిమాగా అవతరించింది. దీని దూకుడే ఇలా ఉంటే.. రేపు మార్చి 19న రాబోయే ధురంధర్ 2.. హిందీలోనే 1000 కోట్ల నెట్ అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..? బాలీవుడ్‌లో తొలి 600, 700, 800 కోట్ల మార్క్ టచ్ చేసిన పుష్ప 2 దగ్గరికి కూడా రాలేకపోయిన స్త్రీ 2, జవాన్, ఛావా పుష్ప 2 సినిమాకు కేవలం హిందీలోనే 830 కోట్లు నెట్ 33 రోజుల్లో పుష్ప 2 పేరు మీదున్న 830 కోట్ల రికార్డును చెరిపేసిన ధురంధర్ ఇండియాలోనే 831 కోట్లు వసూలు చేసిన ధురంధర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: పెద్ద ప్లాన్ చేస్తున్న సమంత.. వర్కవుట్ అయితే రచ్చే
Kalki 2: కల్కి 2పై ఖతర్నాక్ కబురు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే
సంక్రాంతి సినిమాల బిజినెస్ రూ.850 కోట్లు.. అంత స్టామినా ఉందా
భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ విడుదల.. మార్పు మంచికే
చిరంజీవికి సర్జరీ.. అందుకే బయటికి రావడం లేదా ?? మెగా డాటర్ క్లారిటీ
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

