AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోబోలకు నొప్పి తెలుస్తుంది.. సైంటిస్టుల ప్రయోగం సక్సెస్‌

రోబోలకు నొప్పి తెలుస్తుంది.. సైంటిస్టుల ప్రయోగం సక్సెస్‌

Phani CH
|

Updated on: Jan 09, 2026 | 9:33 PM

Share

చైనా శాస్త్రవేత్తలు రోబోలకు కృత్రిమ చర్మాన్ని (ఈ-స్కిన్) అభివృద్ధి చేశారు. న్యూరోమార్ఫిక్ టెక్నాలజీతో ఇది రోబోలకు స్పర్శ జ్ఞానాన్ని, నొప్పిని అనుభవించే లక్షణాన్ని ఇస్తుంది. ప్రమాదకరమైన వస్తువులను తాకినప్పుడు తక్షణమే ప్రతిస్పందించి, చేతిని వెనుకకు లాగుతుంది. ఇది రోబోలకు, మనుషులకు భద్రతను పెంచుతుంది. ఈ ఆవిష్కరణ రోబోల సామర్థ్యాన్ని, భద్రతను కొత్త స్థాయికి చేరుస్తుంది.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన రోబో సినిమా గుర్తుందా.. అందులో అచ్చం మనిషిని పోలీన రోబో సందడి చేస్తుంటుంది. వాసన చూస్తుంది.. వంట వండుతుంది.. డ్రైవింగ్‌ చేస్తుంది. మరయంత్రమే అయినా మనిషిని మించి పనులు చేస్తుంటుంది. నిజంగా రోబోలు ఇలా కూడా ఉంటాయా అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే ప్రస్తుతం చైనా శాస్త్రవేత్తలు అలాంటి రోబోనే డెవలప్‌ చేసినట్లు తెలుస్తోంది. రోబోలకు ఎలక్ట్రానిక్‌ స్కిన్‌ను అభివృద్ధి చేశారు. ఇది రోబోలకు స్పర్శ జ్ఞానాన్ని, నొప్పిని అనుభవించే లక్షణాన్ని ఇస్తుందట. హాంకాంగ్‌ సిటీ విశ్వవిద్యాలయం ఇంజినీర్‌ యుయు గావో నేతృత్వంలో ఈ ఈ-స్కిన్‌ను అభివృద్ధి చేశారు. మానవ నాడీ వ్యవస్థ మాదిరిగా కచ్చితంగా పని చేసే న్యూరోమార్ఫిక్‌ టెక్నాలజీ ఆధారంగా దీనిని తయారు చేశారు. ఈ-స్కిన్‌తో తయారైన రోబో ఏదైనా పదునైన లేదా వేడి వస్తువును తన చేతితో తాకితే, వెంటనే తన చేతిని వెనుకకు లాక్కుంటుంది. దీనివల్ల ఆ రోబోకు, దాని సమీపంలోని మానవులకు రక్షణ పెరుగుతుంది. ఈ కృత్రిమ చర్మాన్ని నాలుగు యాక్టివ్‌ లేయర్స్‌తో తయారు చేశారు. ఎవరైనా ఈ చర్మాన్ని తాకితే, ఆ స్పర్శ ఎలక్ట్రిక్‌ సిగ్నల్‌గా మారుతుంది. మానవుడి మెదడుకు నరాలు పంపించే సంకేతాల వంటివే ఈ సంకేతాలు కూడా. స్పర్శ ఒత్తిడి తేలికగా ఉంటే, అది సాధారణమైనదేనని రోబో భావిస్తుంది, తన పనిని కొనసాగిస్తుంది. నిర్ణీత పరిమితికి మించి ఒత్తిడి పెరిగితే, దానిని నొప్పిగా గుర్తిస్తుంది, వెంటనే ప్రతిస్పందిస్తుంది. సాధారణంగా రోబో చేసే ప్రతి పని దాని సెంట్రల్‌ ప్రాసెసర్‌ ద్వారా జరుగుతుంది. తీవ్రమైన నొప్పి లేదా హానికరమైన గాయం తగిలిన భావం కలిగితే, ఆ సంకేతాలు రోబో మోటర్స్‌కు నేరుగా హై-ఓల్టేజ్‌ పల్స్‌ను పంపిస్తాయి. ఫలితంగా రోబో అవయవాలు తక్షణమే స్పందించి, వెనుకకు వెళ్తాయి. దీని కోసం మెదడు నుంచి వచ్చే ఆదేశాల కోసం వేచి చూడవలసిన అవసరం ఉండదు. మానవుడి చెయ్యి వెలుగుతున్న కొవ్వొత్తిని ముట్టుకున్నపుడు ఏ విధంగా వెనుకకు వెళ్తుందో, అదేవిధంగా ఈ రోబో కూడా పని చేస్తుంది. చిన్న మ్యాగ్నటిక్‌ మాడ్యూల్స్‌తో ఎలక్ట్రానిక్‌ స్కిన్‌ తయారైంది. ఏదైనా పార్ట్ రిపేర్‌ అయితే సెకండ్లలోనే మరమ్మతు చేసే అవాకశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. 37శాతం డేంజర్ జోన్‌లోనే

స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..! విద్యార్థులతో కలిసి టీచర్లు, ఐఏఎస్‌లు

దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??

ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

LIC పాలసీ ప్రీమియం కట్టలేకపోతున్నారా ?? ఇది మీకోసమే