AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'ఆధార్‌' అక్రమాలకు అడ్డుకట్ట.. కొత్త డిజిటల్ యాప్ వచ్చేసింది

‘ఆధార్‌’ అక్రమాలకు అడ్డుకట్ట.. కొత్త డిజిటల్ యాప్ వచ్చేసింది

Phani CH
|

Updated on: Jan 09, 2026 | 9:46 PM

Share

యూఐడీఏఐ ఆధార్ PVC కార్డ్ ఛార్జీలను రూ.75కి పెంచింది. ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త డిజిటల్ యాప్‌ను, పీవీసీ కార్డులలో అధునాతన భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టింది. జనవరి 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ మార్పులతో, వినియోగదారులు ఆధార్ సేవలను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు. ప్రింటింగ్, డెలివరీ ఖర్చులు పెరగడమే ధరల పెంపునకు కారణం.

ఆధార్ కార్డు వినియోగదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బిగ్ షాకిచ్చింది. ఆధార్ అప్డేట్, కార్డుల జారీ ఛార్జీలను పెంచింది. ఆధార్ కార్డుల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసి దుర్వినియోగం కాకుండా యూఐడీఏఐ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కొత్తగా అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెడుతుండగా.. అక్రమాలను నివారించేందుకు పేపర్‌లెస్ ఆధార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఆధార్ యాప్ ను ఇటీవల లాంచ్ చేసింది. దీని ద్వారా ఆధార్ ఫిజికల్ కాపీ అవసరం లేకుండా డిజిటల్ విధానం ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రదేశంలో ఆధార్ ధృవీకరణ అవసరమైతే యాప్ ద్వారానే చేసుకునే సదుపాయం కల్పించింది. ఇక ఆధార్ కార్డును సురక్షితంగా వినియోగించుకునేందుకు ఏటీఎం సైజ్ తరహాలోనే ఉండే పీవీసీ కార్డులను కొత్తగా తీసుకొచ్చింది. గతంలో పీవీసీ కార్డు పొందేందుకు రూ.50 ఛార్జీ ఉండగా.. ఇప్పుడు రూ.75 చేసింది. జనవరి 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. పీవీసీ కార్డ్ కోసం గతంలో కంటే అదనంగా 50 శాతం మేర చెల్లించాల్సి వస్తుంది. యూఐడీఏఐ పోర్టల్ లేదా ఎంఆధార్ యాప్ ద్వారా ఈ పీవీసీ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే మీరు సెలక్ట్ చేసుకున్న అడ్రస్‌కు కార్డు పంపిస్తారు. స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు కార్డు అందుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డు తరహాలోనే ఉండే ఈ పీవీసీ కార్డుల్లో అనేక సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. జేబులో పట్టేంత సైజులో చిన్నగా ఉండే ఈ ఆధార్‌ను సులువుగా క్యారీ చేయవచ్చు. అలాగే ఇందులో ఉండే భద్రతా ఫీచర్లు ఆధార్ దుర్వినియోగం కాకుండా కాపాడతాయి. ట్యాంపర్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్ ,మైక్రో టెక్ట్స్, ఘోస్ట్ ఇమేజ్, జారీ తేదీ, ప్రింట్ తేదీ, ఎంబోస్డ్ లోగో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి మీ ఆధార్‌ను స్మార్ట్‌గా వాడటంతో పాటు దుర్వినియోగం ఆపడం, మీ గుర్తింపును రక్షించడానికి ఉపయోగపడతాయని యూఐడీఏఐ ఎక్స్‌లో స్పష్టం చేసింది. అయితే ఇటీవల పీవీసీ కార్డుల తయారీకి వాడే ముడి సరుకు ధరలు పెరిగాయి. ప్రింటింగ్, డెలివరీ ఖర్చులు పెరిగాయి. కార్డుల డిస్ట్రిబ్యూషన్‌కు ఎక్కువ ధర అవుతుంది. దీంతో జనవరి 1 నుంచి పీవీసీ కార్డుల కోసం రూ.75 వసూలు చేస్తోంది. అలాగే ఇతర వివరాలు అప్డేట్ చేసుకునేందుకు కూడా జనవరి 1 నుంచి ఛార్జీలను యూఐడీఏఐ పెంచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..

సంక్రాంతికి లగ్జరీ కారవాన్‌లో జాలీ ట్రిప్.. ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీ రెడీ

రోబోలకు నొప్పి తెలుస్తుంది.. సైంటిస్టుల ప్రయోగం సక్సెస్‌

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. 37శాతం డేంజర్ జోన్‌లోనే

స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..! విద్యార్థులతో కలిసి టీచర్లు, ఐఏఎస్‌లు

Follow Us