AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..

అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..

Phani CH
|

Updated on: Jan 09, 2026 | 9:43 PM

Share

పూణేలో అర్ధరాత్రి 3 గంటలకు బాల్కనీలో చిక్కుకున్న ఇద్దరు స్నేహితులు, బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ సహాయంతో బయటపడ్డారు. తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉండటంతో, స్నేహితులు సమయస్ఫూర్తితో డెలివరీ యాప్ ద్వారా సహాయం కోరారు. ఏజెంట్ వారి సూచనలతో ఇంట్లోకి వచ్చి డోర్ తీశాడు. ఈ విచిత్ర ఘటన వీడియో వైరల్‌గా మారింది, డెలివరీ ఏజెంట్ సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసించారు.

పుణేలో ఓ విచిత్ర ఘటన జరిగింది. అర్ధరాత్రి ఇంటి బాల్కనీలోనే చిక్కుకుపోయిన ఇద్దరు స్నేహితులు, ఓ డెలివరీ ఏజెంట్ సహాయంతో బయటపడ్డారు. ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. మిహిర్ గహుకర్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి అర్ధరాత్రి 3 గంటల సమయంలో బాల్కనీలో ఉండగా, డోర్ ప్రమాదవశాత్తు లాక్ అయింది. ఇంట్లో తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉండటంతో వారిని లేపడం వీలు పడలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక, ఓ వినూత్న ఆలోచన చేశారు. వెంటనే బ్లింకిట్ యాప్‌లో ఆర్డర్ పెట్టి, వచ్చిన డెలివరీ ఏజెంట్‌కు ఫోన్ చేసి తమ పరిస్థితిని వివరించారు. “అర్ధరాత్రి 3 గంటలకు బాల్కనీలోనే చిక్కుకుపోయాం, అందుకే ఇలా చేశాం” అనే క్యాప్షన్‌తో మిహిర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీడియోలో వారు డెలివరీ ఏజెంట్‌కు ఫోన్‌లో సూచనలిస్తూ, ఇంటి తాళం ఎక్కడుందో చెప్పి, శబ్దం చేయకుండా లోపలికి రమ్మని కోరారు. ఆ ఏజెంట్ వారి సూచనలను పాటిస్తూ నెమ్మదిగా ఇంట్లోకి వచ్చి బాల్కనీ డోర్ తీశాడు. అతడిని చూడగానే ఆ స్నేహితులిద్దరూ సమస్య నుంచి గట్టెక్కినందుకు గట్టిగా నవ్వేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. “ఒకవేళ మీ తల్లిదండ్రులు మేల్కొని అతడిని చూసుంటే పరిస్థితి ఏంటి?” అని ఒకరు వ్యాఖ్యానించగా, “ఆ డెలివరీ ఏజెంట్ ఎంతో సహకరించాడు నిజమైన హీరో అతడే అతనికి మంచి టిప్ ఇవ్వాలి” అని మరొకరు ప్రశంసించారు. సమయస్ఫూర్తి, డెలివరీ ఏజెంట్ సహకారం వల్ల ఓ ఇబ్బందికర రాత్రి, నవ్వులు పూయించే ఘటనగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతికి లగ్జరీ కారవాన్‌లో జాలీ ట్రిప్.. ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీ రెడీ

రోబోలకు నొప్పి తెలుస్తుంది.. సైంటిస్టుల ప్రయోగం సక్సెస్‌

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. 37శాతం డేంజర్ జోన్‌లోనే

స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..! విద్యార్థులతో కలిసి టీచర్లు, ఐఏఎస్‌లు

దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??