AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌

బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌

Phani CH
|

Updated on: Jan 10, 2026 | 9:45 AM

Share

బట్టతల దాచి విగ్గుతో పెళ్లి చేసుకున్న నోయిడా యువకుడిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బండారం బయటపడిన తర్వాత భర్త, అత్తమామలు తనపై గృహహింస, వరకట్న వేధింపులు, దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి, 15 లక్షల విలువైన నగలు లాక్కున్నారని బాధితురాలు తెలిపింది. ఈ మోసం, వేధింపులపై నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఓ యువకుడు తన బట్టతలని దాచిపెట్టి వివాహం చేసుకున్నాడు. నిజం తెలిసిన భార్య పోలీసులను ఆశ్రయించింది. నోయిడా పోలీసుల ప్రకారం.. న్యూఢిల్లీకి చెందిన యువతి నోయిడా యువకుడిని వివాహం చేసుకుంది. అయితే, అతడు తనకు జుట్టు రాలే సమస్య ఉందని చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడనీ పెళ్లిలో తన బట్టతల విషయం దాచిపెట్టి, సాధారణంగా కనిపించడానికి విగ్ ధరించాడని బాధితురాలు ఫిర్యాదులో రాసుకొచ్చింది. వివాహం తర్వాత ఆమె అత్తమామల ఇంటికి వచ్చినప్పుడు, తన భర్త విగ్‌ను తీసి పక్కన పెట్టడం చూసింది. దాంతో అతని బండారం బయటపడింది. అది తట్టుకోలేని బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి కొడుకు మోసాన్ని గ్రహించిన బాధితురాలు భర్త, అత్తమామలను నిలదీయటంతో వారి ప్రవర్తన మారిపోయిందని చెబుతోంది. తన భర్త తన మొబైల్ ఫోన్‌తో ప్రైవేట్ ఫోటోలను తీశాడని, వాటిని వైరల్ చేస్తానని బెదిరించినట్టుగా ఆరోపించింది. డబ్బు కూడా డిమాండ్ చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ప్రతిఘటించడంతో తనను కొట్టి, మానసికంగా హింసించాడని భర్తతో పాటు అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది. భర్త ఆమె నుంచి సుమారు 15 లక్షల రూపాయలు విలువ చేసే నగలను లాక్కొని, ఆమెపై దాడి చేసి, ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. దాంతొ బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్తతో సహా ఐదుగురిపై వరకట్న వేధింపులు, దాడి, బెదిరింపులు, మోసం, దోపిడీకి సంబంధించిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని ఆరోపణలను తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నామని, అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నామని బిస్రాఖ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనోజ్ కుమార్ చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఆధార్‌’ అక్రమాలకు అడ్డుకట్ట.. కొత్త డిజిటల్ యాప్ వచ్చేసింది

అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..

సంక్రాంతికి లగ్జరీ కారవాన్‌లో జాలీ ట్రిప్.. ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీ రెడీ

రోబోలకు నొప్పి తెలుస్తుంది.. సైంటిస్టుల ప్రయోగం సక్సెస్‌

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. 37శాతం డేంజర్ జోన్‌లోనే