విజయవాడ దుర్గగుడిలో భక్తులకు తప్పిన ప్రమాదం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడిలో ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద స్వల్ప విద్యుత్ షాక్ సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించి కరెంట్ సరఫరా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించిన అనంతరం ప్రసాద పంపిణీ యథావిధిగా కొనసాగింది. భక్తులు సురక్షితంగా ప్రసాదం స్వీకరించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద భక్తులకు పెను ప్రమాదం తప్పింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో విద్యుత్ షాక్ సంభవించింది. కరెంట్ షాక్ రావడంతో వెంటనే అప్రమత్తమైన దుర్గగుడి అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం, దుర్గగుడి అధికారులు, ఏఈ (అసిస్టెంట్ ఇంజినీర్) అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ షాక్‌కు గల కారణాలను తెలుసుకుని, సమస్యను వెంటనే పరిష్కరించారు. అధికారులు సత్వర చర్యలు తీసుకోవడంతో, ప్రసాద పంపిణీ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్
అలర్ట్..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా ..
గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్
ప్రియురాలికి ప్రపోజ్ చేయబోతే రింగ్ జారిపడింది.. చివరకు..
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్..
ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

