బాలయ్య, కొరటాల.. మధ్యలో ఓ ట్విస్ట్..!
బాలకృష్ణ, కొరటాల శివ సినిమా ఖరారైంది. ఈ ప్రకటనతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కొరటాల తన గత విజయవంతమైన సందేశాత్మక చిత్రాల బాటలోకి తిరిగి వస్తున్నారని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. "దేవర" ఆలస్యం కావడంతో కొరటాల బాలయ్యతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు.
బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ వార్తతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, కొరటాల శివ బాలయ్య మాస్ రూట్‌ను అనుసరిస్తారా లేదా బాలయ్య కొరటాల శైలికి మారుతారా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని, ఆగస్టులో షూటింగ్ పూర్తి కానుంది. దేవర చిత్రం ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో, కొరటాల శివ బాలయ్యతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో దేవరపై అభిమానుల్లో నమ్మకం తగ్గుతోంది. కొరటాల శివ ఇటీవల “ఆచార్య”తో ఎదురైన పరాజయం, “దేవర” విజయం ఎన్టీఆర్ ఇమేజ్‌కు వెళ్తుందనే అంచనాల నేపథ్యంలో, ఆయన తన పునర్వైభవం కోసం సందేశాత్మక కథల వైపు మొగ్గు చూపుతున్నారు.
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు
గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్ నుంచి బార్ ఓనర్‌గా
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!

