- Telugu News Photo Gallery Cinema photos Will this year's film calendar become weak with focus on 2026?
Movie Releases: 2025కి నో.. 2026పై ఫోకస్.. ఈ ఏడాది సినీ క్యాలెండర్ వీక్ కానుందా.?
పాన్ ఇండియా ట్రెండ్‌లో స్టార్ హీరోల సందడి బాగా తగ్గిపోతోంది. హీరోలు ఒకే ప్రాజెక్ట్ మీద రెండు మూడేళ్లు వర్క్ చేస్తుండటంతో కొన్ని క్యాలెండర్ ఇయర్స్‌లో స్టార్స్ సందడే లేకుండా.. ఈ ఏడాది కూడా అలాంటి షార్టేజే కనిపిస్తోంది. ఎక్కువ మంది స్టార్స్ 2026 మీద ఫోకస్ చేస్తుండటంతో ఈ ఏడాది సినీ క్యాలెండర్ వీక్‌గా కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఇయర్ లిస్ట్‌లో ఉన్న సినిమాలేంటి? నెక్ట్స్ ఇయర్‌కు రెడీ అవుతున్న స్టార్స్ ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Apr 16, 2025 | 3:25 PM

2025 సంక్రాంతి తరువాత టాలీవుడ్ స్క్రీన్ మీద స్టార్ హీరోల జోరు పెద్దగా కనిపించటం లేదు. కనీసం నెలకు ఒక్క బిగ్ హీరో కూడా బరిలో దిగే ఛాన్స్ కనిపించటం లేదు. అన్ని సినిమాలు లెక్కేసుకున్నా... మూడు నాలుగు తప్ప టాప్ హీరోల నుంచి ఎక్కువ మూవీస్ ఈ ఇయర్ రిలీజ్ లిస్ట్‌లో కనిపించటం లేదు.

ఈ ఏడాది బరిలో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న కింగ్డమ్, అలాగే బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 తాండవం చిత్రాలు మాత్రమే పక్కాగా వచ్చే పరిస్థితి ఉంది.

చిరంజీవి విశ్వంభర విషయంలో అఫీషియల్ క్లారిటీ లేదు. పవన్, హరి హర వీరమల్లు పక్కాగా వస్తుందని చెబుతున్నా... ఆడియన్స్‌లో ఆ నమ్మకం కలగటం లేదు. వార్ 2 పక్కాగా రిలీజ్ అవుతుందన్న గ్యారెంటీ ఉన్నా.. అది హిందీ సినిమాగానే ప్రొజెక్ట్ అవుతోంది.

ఈ ఏడాది క్యాలెండర్... వీక్‌గా ఉన్నా.. నెక్ట్స్ ఇయర్ మాత్రం వరుసగా స్టార్ హీరోల సందడి ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్టీఆర్ డ్రాగన్, రామ్ చరణ్ పెద్ది, ప్రభాస్ ఫౌజీ, చిరు - అనిల్ మూవీతో పాటు ఈ ఏడాది క్యాలెండర్ నుంచి తప్పుకుంటున్న మరికొన్ని సినిమాలు కూడా 2026 డేట్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి.

వీళ్లతో పాటు ఇతర భాషల నుంచి కూడా పాన్ ఇండియా హీరోలు 2026 క్యాలెండర్ మీద ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఈ ఏడాదిలో మిస్ అయిన స్టార్ పవర్... నెక్ట్స్ ఇయర్‌లో ఫుల్ ఫిల్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఆడియన్స్.





























