- Telugu News Photo Gallery Cinema photos Prashanth Neel faces problems from Yash fans in kannada industry
Prasanth Neel: ప్రశాంత్ నీల్‌కు కొత్త తలనొప్పులు.. హోం గ్రౌండ్‌లో చిక్కులు..
ప్రజెంట్ నేషనల్ లెవల్‌లో మోస్ట్ క్రేజీయస్ట్ దర్శకుల్లో ప్రశాంత్ నీల్ కూడా ఒకరు. కేజీఎఫ్ హిట్‌తో యష్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన ప్రశాంత్‌నీల్‌కు ఇప్పుడు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అదర్ స్టేట్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. హోం గ్రౌండ్‌లో మాత్రం చిక్కులు తప్పటం లేదు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Apr 16, 2025 | 4:05 PM

కేజీఎఫ్ 2 తరువాత 2023లో విడుదలైన ప్రభాస్ సలార్‌తో మరో బిగ్ హిట్‌ను అందుకున్న ప్రశాంత్ నీల్. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. ఇది వెంటనే వస్తుంది అనుకున్నారు అంతా.. అయితే ఇది కాస్త ఆలస్యం కానుంది.

ప్రజెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ స్టార్ దర్శకుడు. ఏప్రిల్ 22 నుంచి తారక్ కూడా సెట్‌లో అడుగుపెట్టబోతుండటంతో ఇప్పట్లో ప్రశాంత్ నీల్ ఫ్రీ అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. నీల్ ఇంత బిజీగా ఉంటే కన్నడ సీమ నుంచి కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి.

రీసెంట్‌గా కేజీఎఫ్ 2 రిలీజ్ అయి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో వింత పరిస్థితి కనిపించింది. ప్రజెంట్ యష్ టాక్సిక్ సినిమాలో నటిస్తుంటే ఆ సినిమాను పట్టించుకోకుండా కేజీఎఫ్ 3 అప్‌డేట్ కావాలంటూ డిమాండ్ చేశారు రాకీభాయ్ ఫ్యాన్స్.

కేజీఎఫ్ 3 అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ చేస్తున్న డిమాండ్స్ ప్రశాంత్ నీల్ మీద కూడా ప్రెజర్ పెంచుతున్నాయి. వరుసగా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తుండటంతో మళ్లీ కన్నడ సీమకు తిరిగి వచ్చేది ఎప్పుడన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు సినిమా స్టార్ట్ చేయకపోయినా... ఎప్పుడు ఉంటుందో చెప్పాలంటున్నారు యష్ అభిమానులు.

ప్రొడక్షన్ హౌస్ నుంచి కేజీఎఫ్ 3 ఉంటుందన్న క్లారిటీ ఎప్పుడో వచ్చింది. అదే క్లారిటీ ఇంకాస్త డిటైల్డ్ హీరో, డైరెక్టర్ సైడ్ నుంచి కూడా కావాలంటున్నారు ఫ్యాన్స్. మరి ప్రెజర్‌ను ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.





























