PM Modi: గుజరాత్‌లో గత రికార్డులన్నీ బద్దలు కొడతాం.. సోమనాథుడికి ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు..
గుజరాత్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీజేపీ, విపక్షపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ.. గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
PM Narendra Modi in Gujarat: గుజరాత్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీజేపీ, విపక్షపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ.. గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. ఆదివారం ఉదయాన్నే ప్రధాని మోదీ సోమనాథ్ (Somnath Temple) ఆలయానికి చేరుకుని.. మహాదేవుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమనాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీ.. పండితులు, అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. అనంతరం ప్రధాని మోడీ వేదపండితులతో కలిసి మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా మహా శివుడు సోమనాథుడికి హారతినిచ్చారు. పూజల అనంతరం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కాగా, సోమ్‌నాథ్ ట్రస్టుకు ప్రధాని మోదీ చైర్మన్‌గా ఉన్న విషయం తెలిసిందే. సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఎప్పుడు కూడా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ దాదాపు అర్ధగంట పాటు ప్రత్యేక పూజలు చేశారు.
#WATCH | Prime Minister Narendra Modi visits the Somnath temple in Gujarat, offers prayers
ఇవి కూడా చదవండి(Source: DD) pic.twitter.com/zq5nJCIQEA
— ANI (@ANI) November 20, 2022
కాగా.. ప్రధాని మోడీ గిరి పర్యటనకు ముందు.. అంతకుముందు ప్రధాని మోడీ.. ఈ ప్రాంతంలో పర్యటించిన ఫొటోలను షేర్ చేశారు. సోమనాథుడికి పూజలు చేసిన అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు. గుజరాత్‌లో ఈసారి రికార్డులు బద్దలవుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని మరోసారి స్పష్టంచేశారు. నరేంద్ర మోడీ రికార్డులన్నింటినీ భూపేంద్ర బ్రేక్ చేస్తారంటూ పేర్కొన్నారు. అందుకు నరేంద్రుడు కృషి చేస్తాడన్నారు. గతంలో గుజరాత్ అభివృద్ధిపై అనుమానం ఉండేదని, నేడు గుజరాత్ కొత్త శిఖరాలకు చేరుతోందని పేర్కొన్నారు.
Glimpses of Prime Minister @narendramodi from Somnath Temple pic.twitter.com/f14Ec1Drte
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) November 20, 2022
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సోమనాథ్ ఆలయ సందర్శన అనంతరం సౌరాష్ట్ర నుంచి సూరత్ వరకు రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఎనిమిది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆలయ సందర్శన తర్వాత సౌరాష్ట్ర ప్రాంతంలోని వెరావల్, ధోరార్జీ, అమ్రేలి, బొటాడ్‌లలో నాలుగు ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్రలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎన్నికలలో బీజేపీ గెలిచినప్పటికీ.. సాంప్రదాయకంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును సొంతంచేసుకోలేదు.
కాగా..రేపు, ప్రధాని మోడీ సురేంద్రనగర్, భరూచ్, నవ్సారిలో ప్రధాని మోదీ మూడు ర్యాలీలు నిర్వహించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..