Jabardasth: అనసూయ ప్లేస్‌లో జబర్దస్త్ యాంకర్‌గా ఛాన్స్.. ఆ కారణంతో రిజెక్ట్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఎవరంటే?
జబర్దస్త్ టీవీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడంటే రేటింగుల్లో వెనకపడిందేమో కానీ మొన్నటివరకు ఈ కామెడీ షోకు మస్త్ క్రేజ్ ఉండేది. ఈ షోలో పార్టిసిపేట్ చేసిన వారిలో చాలా మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటున్నారు.

కంటెంట్ పరంగా కొన్ని విమర్శలున్నా మొన్నటివరకు జబర్దస్త్ కామెడీ షోకు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ వచ్చింది. గతంలో కంటే కాకపోయినా ఇప్పుడు కూడా చాలా మంది ఈ కామెడీ షోను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. ఈ షోలో కంటెస్టెంట్స్ గా పనిచేసిన వారిలో చాలా మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా రాణిస్తున్నారు. ఇక ఇదే జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సినిమాల్లోనే సెటిలైపోయింది. అయితే అనసూయ తర్వాత ఈ షోకు హోస్ట్ గా చేసే అవకాశం బిగ్ బాస్ ఫేమ్ దివి వద్త్య కు వచ్చిందంట. అయితే కొన్ని కారణాలతో ఈ జబర్దస్త్ ఆఫర్ ను వదిలేసుకుందట. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోన్న దివి తాజాగా ఓ ఇంటర్వ్యుకు హాజరైంది. ఇదే సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో జబర్థస్త్ లో యాంకర్‌గా అవకాశం తనకే ముందుగా వచ్చిందని ఆమె వెల్లడించింది.
‘అనసూయ వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని రోజులు జబర్దస్త్ షోకు రాలేకపోయారు. దీంతో జబర్దస్త్ టీమ్ నన్ను సంప్రదించింది. ‘మీరు యాంకరింగ్ చేస్తారా?’ అని ఆఫర్ ఇచ్చారు. కానీ ఆ సమయంలో నాకు యాంకరింగ్ రాదనే భయం ఎక్కువగా ఉండడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. ‘నాకు యాంకరింగ్ చేతకాదు అనిపించింది. ఆ భయంతోనే జబర్దస్త్ అవకాశాన్ని వదిలేశాను. కొంతకాలం తర్వాత మళ్లీ అదే షో నుంచి కాల్ వచ్చింది. అనసూయ షో నుంచి వెళ్లిపోతున్నారు. మీరు యాంకర్‌గా చేయగలరా? అని మరోసారి అడిగారు. అయితే అప్పటికే నాకు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. దీంతో యాంకరింగ్ చేయాలా? వద్దా ? అని డైలమాలో పడ్డాను. దీనికి సంబంధించిన నా ఫ్రెండ్స్ ను కూడా అడిగాను. తన స్నేహితులను కూడా అడిగానని తెలిపింది. కొందరు యాంకరింగ్ చేయమని చెప్పగా, మరికొందరు మాత్రం సినిమాలపై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు. చివరికి సినిమాల కోసం ప్రయత్నించాలనే నిర్ణయం తీసుకుని జబర్దస్త్ యాంకరింగ్ అవకాశాన్ని కోల్పాయను. అప్పుడు ఆ ఛాన్స్ తీసుకుని ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదేమో’అని దివ్య ఎమోషనల్ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




